రియల్ ఎస్టేట్ రంగానికి జీఎస్టీ కౌన్సిల్ తీపికబురు

రియల్ ఎస్టేట్ రంగానికి జీఎస్టీ కౌన్సిల్ తీపికబురును అందజేసింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. అంతేకాదు అందుబాటు ధరల్లో ఉండే ఇళ్లను కొనేవాళ్లకు కూడా ఓ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటివరకు దీనిపై ఉన్న జీఎస్టీని 8 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించడం విశేషం. ఈ తగ్గించిన జీఎస్టీలకు సంబంధించి ఆదివారం జరిగిన 33వ జీఎస్టీ […]

రియల్ ఎస్టేట్ రంగానికి జీఎస్టీ కౌన్సిల్ తీపికబురు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:43 PM

రియల్ ఎస్టేట్ రంగానికి జీఎస్టీ కౌన్సిల్ తీపికబురును అందజేసింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. అంతేకాదు అందుబాటు ధరల్లో ఉండే ఇళ్లను కొనేవాళ్లకు కూడా ఓ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటివరకు దీనిపై ఉన్న జీఎస్టీని 8 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించడం విశేషం. ఈ తగ్గించిన జీఎస్టీలకు సంబంధించి ఆదివారం జరిగిన 33వ జీఎస్టీ కౌన్సిల్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇది అందరికీ ఇళ్లు ఉన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. మిడిల్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజల సొంతింటి కలలను కూడా నిజం చేస్తుంది అని జైట్లీ అన్నారు. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊపునిస్తుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.