ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 5శాతమే

GST Council meeting: Rates on electric vehicles and chargers slashed to 5%, ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 5శాతమే

అనుకున్నట్లుగానే జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 36వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయ్యింది. అయితే బడ్జెట్‌లో విద్యుత్ వాహనాలపై అనేక రాయితీలను ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశంలో విద్యుత్తు వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే విద్యుత్తు వాహనాలు చార్జీలపై జీఎస్టీ తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈవీ చార్జర్లపై జీఎస్‌టీనీ 18 నుంచి తగ్గించి 5 శాతంగా ఉంచింది. అలాగే స్థానిక అధికారులకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై జీఎస్‌టీ నుంచి మినహాయింపునివ్వడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పన్ను రేట్లు ఆగస్టు 1 వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఇ-వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయాన్ని ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రతినిధులు పూర్తిగా సమర్ధించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *