నేడు జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం

GST Council meet today, నేడు జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం

35వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో ఇవాళ జరగనుంది. ఈ సమావేశం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సారథ్యంలో జరగనుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశాన్ని పరిశీలించనున్నారు. జీఎస్‌టీ ఎగవేతలను నివారించేందుకుగాను ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్‌ యంత్రాంగంతో ఈ-వే బిల్‌ను 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అనుసంధానం చేయడం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *