బ్రేకింగ్: ‘చంద్రయాన్-2’ ప్రయోగం సక్సెస్.. భారత్ సరికొత్త రికార్డు

GSLV-MkIII carrying Chandrayaan-2 lifts off successfully, బ్రేకింగ్: ‘చంద్రయాన్-2’ ప్రయోగం సక్సెస్.. భారత్ సరికొత్త రికార్డు

‘చంద్రయాన్-2’ ప్రయోగం విజయవంతమైంది. దీంతో.. శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకున్నారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగి.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లింది.

మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్-2.. లాంచ్ వెహికల్‌ని రాకెట్ విడిచింది. 3.8 టన్నుల రాకెట్ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్తుంది. చంద్రుని ఉపరితలం పై చిత్రాలు రోవర్ పంపనుంది. అనంతరం రెండో దశను కూడా విజయవంతంగా పూర్తిచేసి.. ఆర్బిటార్ కక్ష్యలోకి చేరింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ కావడంతో.. భారత్.. సరికొత్త రికార్డును సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *