జో బైడెన్ ఎన్నికపై రిపబ్లికన్ సెనెటర్ల ఛాలెంజ్, విజేతగా ఆయన సర్టిఫికేషన్ ని వ్యతిరేకిస్తామని ప్రకటన, వచ్ఛే వారం ఓటింగ్

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కి డోనాల్డ్ ట్రంప్ అనుకూలురైన రిపబ్లికన్ సెనెటర్ల నంచి కూడా 'ముప్పు' ఏర్పడుతోంది.

జో బైడెన్ ఎన్నికపై రిపబ్లికన్ సెనెటర్ల ఛాలెంజ్, విజేతగా ఆయన సర్టిఫికేషన్ ని వ్యతిరేకిస్తామని ప్రకటన, వచ్ఛే వారం ఓటింగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 03, 2021 | 1:06 PM

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కి డోనాల్డ్ ట్రంప్ అనుకూలురైన రిపబ్లికన్ సెనెటర్ల నంచి కూడా ‘ముప్పు’ ఏర్పడుతోంది. ప్రముఖ ఎంపీ టెడ్ క్రజ్ నేతృత్వంలో సుమారు 12 మంది ఎంపీలు..బైడెన్ ఎన్నికను తాము అంగీకరించబోమని అంటున్నారు. ఆయన ఎన్నికను సర్టిఫై చేయడానికి వచ్ఛే వారం జరిగే ఓటింగ్ లో దానికి అనుకూలంగా ఓటు చేయబోమని వీరు తెలిపారు. బైడెన్ విక్టరీ పై బుధవారం నాడు కాంగ్రెస్ ఉభయ సభలూ సమావేశమై లాంఛనంగా ఆయనను విజేతగా సర్టిఫై చేయాల్సి ఉంది. ఆ సందర్భంగా ….. ఎన్నికల ఫలితాలపై అత్యవసరంగా 10 రోజుల ఆడిట్ నిర్వహించేందుకు స్పెషల్ కమిషన్ ని (కమిటీని) ఏర్పాటు చేయాలని మేము కోరనున్నాం అని ఈ సెనెటర్లు వెల్లడించారు. ఈ ఎలెక్షన్స్ లో ఫ్రాడ్, అవకతవకలు జరిగాయని ఎన్నో ఆరోపణలు వచ్చా యని, తమ జీవితాల్లో ఇన్ని ఆరోపణలు చూడలేదని వారన్నారు. మొత్తం 11 మంది ఎంపీలు ఈ మేరకు ఓ స్టేట్ మెంట్ పై సంతకాలు చేశారు. బైడెన్ ఎన్నికను తను సవాలు చేస్తానని, దాన్ని వందమందికి పైగా రిపబ్లికన్లు సమర్థిస్తారని లూయీ గోమెర్ట్ అనే ఎంపీ చెప్పారు. అనేకమంది డెమొక్రాట్లు కూడా దీనికి మద్దతునిస్తారని అన్నారు.

అయితే ఈ ఎంపీల యత్నాలన్నీ విఫలమయ్యేట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే డజనుకు పైగా కోర్టులు ఎన్నికల్లో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని స్పష్టం చేశాయి.  ఇలా ఉండగా…. ట్రంప్ తన ట్విటర్ వార్ మాత్రం ఆపలేదు. తన ఘన విజయాన్ని దొంగిలించడానికి జరిగే యత్నం నీరు గారిపోతుందని నిన్న ట్వీట్ చేశారు. ఈ కొద్ధి మంది ఎంపీలే కాక మరెంతోమంది ఎంపీలు కూడా తనకు మద్దతునిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉటా సెనెటర్..మిట్ రోమ్నే .. ట్రంప్ ఆశయాలకు గ్రహణం పట్టిందని ఆరోపించారు. ఓటర్ల అభిప్రాయాలను తిరస్కరించాలన్న భావనలు అమెరికా డెమొక్రటిక్ సార్వభౌమాధికారానికి ప్రమాదకర ధోరణులుగా ఆయన అభివర్ణించారు.

Read More:

తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయం.. కోవిడ్ రిపోర్ట్ తెచ్చినవారికి మాత్రమే ఉంటుందన్న ఆలయ అధికారులు

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై చైనా ఫైర్, బైడెన్ పాలన మాకు అనుకూలంగా ఉంటుందని అంచనా, విదేశాంగ మంత్రి వాంగ్

మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో విభేదాలు ? ఔరంగాబాద్ పేరు మార్పుపై తంటా, సేన ప్రతిపాదన, వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.