పాతాళంలోకి భూగర్భ జలాలు

మెదక్ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ఏ మండలంలో చూసినా కనుచూపుమేరలో నీటి ఛాయలు కనిపించడం లేదు. గడచిన రెండేళ్ళలో వర్షాభావం వల్ల‌ భూగర్భజలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. అత్యధికంగా కొల్చారం మండలంలో 40 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. నీటి కరువుతో జిల్లాలో సాగు కనిపించడం లేదు. ఎలా బతకాలో తెలియక ఇప్పటికే పలువురు రైతులు వలసబాట పట్టారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జనవరి […]

పాతాళంలోకి భూగర్భ జలాలు
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 2:13 PM

మెదక్ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ఏ మండలంలో చూసినా కనుచూపుమేరలో నీటి ఛాయలు కనిపించడం లేదు. గడచిన రెండేళ్ళలో వర్షాభావం వల్ల‌ భూగర్భజలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. అత్యధికంగా కొల్చారం మండలంలో 40 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. నీటి కరువుతో జిల్లాలో సాగు కనిపించడం లేదు. ఎలా బతకాలో తెలియక ఇప్పటికే పలువురు రైతులు వలసబాట పట్టారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జనవరి నెలలో చందాయిపేటలో 20.20 మీటర్ల దూరంలో ఉండగా ఫిబ్రవరిలో 23.40 మీటర్ల లోతులోకి పడిపోయాయి. నెలవ్యవధిలోనే ఏకంగా 3.20 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు పడిపోయాయి. కొల్చారం మండలంలో 40.10 మీటర్లలోతులోకి నీటిమట్టాలు పడిపోవటంవటంతో ఆ మండలంలో ఇప్పటికే 70శాతం బోర్లు మూలనపడ్డాయి. ఈ యేడు ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షపాతం 739.4 సెంటీమీటర్లు నమోదు కావల్సి ఉండగా కేవలం 491.4 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణం కన్నా 40 శాతం తక్కువగా వర్షం కురిసింది. ఫలితంగా జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. దీంతో చెరువులు, కుంటలు వట్టిపోయాయి. ఈ ఏడాది రబీసీజన్‌లో సాధారణ సాగు 38 వేల హెక్టార్లు కాగా కేవలం 15 వేల హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. 23 వేల హెక్టార్లు తక్కువ సాగు నమోదైంది.