మొక్కల్లో పవార్‌ రూపం..వెరైటీ అభిమానం

పుర్రెకో బుద్ధి జిహ్వకో చాపల్యమన్నట్లు..ఒక్కొక్కరికీ ఒక్కో టేస్ట్‌ ఉంటుంది. కొందరు ఫిల్మ్‌ స్టార్స్‌ను లైక్‌ చేస్తే..మరికొందరు క్రీడాకారులను..ఇంకొందరు పొలిటికల్‌ లీడర్స్‌పై తమ అభిమానాన్నిరకరకాలుగా చాటుకుంటూ ఉంటారు. కొందరు తమకు నచ్చిన వారి చిత్రాలను టాటూలుగా వేయించుకుంటే..ఇక్కడ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు తన అభిమానాన్ని వెరైటీగా ప్రదర్శించాడు.  తనకున్న పదెకరాల పొలంలో తన ప్రియతమ నేత చిత్రాన్ని పంటగా వేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లా నిపానిగావ్‌ వాసి మంగేశ్‌ నిపానికర్‌కు ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ […]

మొక్కల్లో పవార్‌ రూపం..వెరైటీ అభిమానం
Follow us

|

Updated on: Dec 16, 2019 | 4:38 PM

పుర్రెకో బుద్ధి జిహ్వకో చాపల్యమన్నట్లు..ఒక్కొక్కరికీ ఒక్కో టేస్ట్‌ ఉంటుంది. కొందరు ఫిల్మ్‌ స్టార్స్‌ను లైక్‌ చేస్తే..మరికొందరు క్రీడాకారులను..ఇంకొందరు పొలిటికల్‌ లీడర్స్‌పై తమ అభిమానాన్నిరకరకాలుగా చాటుకుంటూ ఉంటారు. కొందరు తమకు నచ్చిన వారి చిత్రాలను టాటూలుగా వేయించుకుంటే..ఇక్కడ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు తన అభిమానాన్ని వెరైటీగా ప్రదర్శించాడు.  తనకున్న పదెకరాల పొలంలో తన ప్రియతమ నేత చిత్రాన్ని పంటగా వేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లా నిపానిగావ్‌ వాసి మంగేశ్‌ నిపానికర్‌కు ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ అంటే చాలా అభిమానం. ఆయనపై ఉన్న ప్రేమను తన పొలంలో చూపించాడు. ముందుగా వేర్వేరు ధాన్యాలను చల్లి మొలకలొచ్చాక పవార్‌ చిత్రం రూపంలో మొక్కలను తీర్చిదిద్దాడు. ఇందుకోసం 15 రోజులు శ్రమించి పవార్‌ చిత్రాన్ని సృష్టించి ఇలా వినూత్న పద్ధతిలో అభిమానాన్ని చాటుకున్నాడు.