GHMC Election Result 2020 Live Update : గ్రేటర్‌‌లో అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్.. రెండో స్థానంలో బీజేపీ..

|

Updated on: Dec 05, 2020 | 7:22 AM

GHMC Elections 2020 Results Live: గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది.  పోలింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ సిబ్బంది చేరుకున్నారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ చేస్తున్నారు.

GHMC Election Result 2020 Live Update : గ్రేటర్‌‌లో అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్.. రెండో స్థానంలో బీజేపీ..

GHMC Elections 2020 Results Live: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో హంగ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన అధిక్యం కట్టబెట్టలేదు. మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం దక్కాలంటే 76 సీట్లు సాధించాలి. అయితే ఏ పార్టీ కూడా మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. 55కి పైగా డివిజన్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది. 48 సీట్లు సాధించిన బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక ఎంఐఎం 44 డివిజన్ కైవసం చేసుకుని మూడో స్థానానికి పరిమితమైంది. నేరెడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు హై కోర్టు ఉత్తర్వుల కారణంగా నిలిచిపోయింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Dec 2020 12:07 AM (IST)

    51 స్థానాలకు పోటీ చేస్తే 44 స్థానాల్లో గెలుపొందాం…

    గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. గత జీహెచ్ఎంసీ 44 స్థానాల్లో గెలువగా, ప్రస్తుతం కూడా 44 స్థానాల్లోనే గెలుపొందామని తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సమష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైందని అన్నారు. కాగా, ఓవైసీ ఇంటికి భారీగా చేరుకున్న ఎంఐఎం కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

  • 04 Dec 2020 10:16 PM (IST)

    నేరెడ్ మెట్ మినహా ముగిసిన గ్రేటర్ ఓట్ల లెక్కింపు…

    హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఎన్నికల లెక్కింపు నేరెడ్ మెట్ డివిజన్ మినహా పూర్తి అయ్యింది. 150 డివిజన్లకు జరిగిన పుర పోరులో కారు పార్టీకి 55 స్థానాల్లో విజయం వరించింది. బీజేపీకి 48 స్థానాల్లో విజయం లభించింది. పాతబస్తీ ప్రాంతాల్లో ఎంఐఎం 44 డివిజన్లలో గెలుపొందింది. కాగా, కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమవగా… ఈసారి కూడా కాంగ్రెస్ కు రెండు స్థానాల్లోనే గెలుపు దక్కింది. టీడీపీ ఖాతా తెరవలేదు.

  • 04 Dec 2020 09:47 PM (IST)

    మేయర్ పీఠంపై స్పష్టత కరువు... ఎవరికీ రాని మెజార్టీ....

    గ్రేటర్ మేయర్ పీఠంపై స్పష్టత కరువైంది. బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఇప్పుడు పొత్తుల పర్వం అనివార్యమైంది. కానీ, లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ మేయర్ స్థానం గురించి ఇప్పుడే ఆలోచించమని అంటోంది. అయితే మేయర్ స్థానం కైవసం కావాలంటే ఎంఐఎం కీలకం కానుంది.

  • 04 Dec 2020 09:23 PM (IST)

    రాబోయే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్....

    భాజపా విజయాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఈసీకి, డీజీపీకి ఈ విజయాన్ని అంకితమిస్తున్న అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ అన్నారు. ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షడు లక్ష్మణ్ తో కలిసి మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ పాలనను నిరసిస్తూ.. బీజేపీపై గురుతర బాధ్యతను ఉంచారని అన్నారు. 2023 ఎన్నికల్లో కారు షెడ్డుకే పరిమితమవుతుందని అన్నారు.  రాబోయే ఎన్నికల్లోనూ గ్రేటర్ తరహా ఫలితాలే పునరావృతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

  • 04 Dec 2020 08:57 PM (IST)

    కార్యకర్తల కృషి అభినందనీయం... గ్రేటర్ పోరులో బీజేపీ ప్రదర్శనపై అమిత్ షా ట్వీట్....

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై, బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలని బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తెలుగులో ట్వీట్ చేశారు. అందులో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు అభినందనలు తెలిపారు.

  • 04 Dec 2020 08:50 PM (IST)

    సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు పని చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల అనంతరం ఆయన తెలంగాణ భవన్ నుంచి మాట్లడాతూ... కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలు తాము ఆశించినంతగా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగ్ లార్జెస్ట్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై చర్చిస్తామని అన్నారు. ఇప్పుడే మేయర్ కుర్చీ గురించి మాట్లాడనని, దానికి ఇంకా సమయం  ఉందని అన్నారు.

  • 04 Dec 2020 08:36 PM (IST)

    నేరెడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత....

    హైకోర్టు ఆదేశాలతో నెరెడ్‌మెట్ డివిజన్లో ఓట్ల లెక్కింపు నిలిపివేత. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున నిలిపివేత. హైకోర్టు ఆదేశాల ప్రకారం లెక్కింపు నిలిపివేత. రిటర్నింగ్ అధికారి ఎస్ఈసీకి నివేదిక పంపారు.

  • 04 Dec 2020 08:18 PM (IST)

    బీఎన్‌రెడ్డి డివిజన్లో బీజేపీ గెలుపు...

    బీఎన్ రెడ్డి డివిజన్ లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కాగా, ఆ అభ్యర్థికి 32 ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే డివిజన్ లో ఇండిపెండెంట్ డమ్మీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న కుమారుడు ముదగౌని రంజిత్ గౌడ్ పోటీ ఉన్నాడు. అతడికి 39 ఓట్లు వచ్చాయి. దాంతో టీఆర్ఎస్ అభ్యర్థి చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్నాడు...

  • 04 Dec 2020 08:01 PM (IST)

    కాంగ్రెస్ గెలుపొందిన స్థానాలు.. అభ్యర్థులు వీరే..

    గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవి చూసింది. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ గెలుపొందిన స్థానాలు.. అభ్యర్థుల వివరాలు ఇవే..

    ఎ.ఎస్.రావు నగర్ - డాక్టర్ శిరీషారెడ్డి

    అడ్డగుట్ట - ఉదయకాంత కుమారి

  • 04 Dec 2020 07:50 PM (IST)

    జంగమెట్లో బీజేపీ ఆధిక్యం...

    జంగమెట్ డివిజన్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా, ఈ డివిజన్ ఎంఐఎంకు సిట్టింగ్ స్థానం. ఇప్పుడు అక్కడ 603 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఉన్నారు.

  • 04 Dec 2020 07:47 PM (IST)

    ప్రగతిభవన్‌ నుంచి సింధుకు పిలుపు...

    గ్రేటర్‌ ఎన్నికల్లో 111 డివిజన్‌ భారత్‌ నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఆదర్శ్‌ రెడ్డి గెలుపొందారు. ఆమెకు ప్రగతి భవన్‌కు రావాలని పిలుపు వచ్చినట్లు సమాచారం. సింధు ఆదర్శ్‌ రెడ్డి  మెదక్‌ ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి కోడలు. అయితే, సింధు మేయర్ స్థానం కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

  • 04 Dec 2020 07:45 PM (IST)

    106 చోట్ల పోటీ చేస్తే... ఒక్క చోటా డిపాజిట్ దక్కించుకోలేకపోయిన టీడీపీ....

    గ్రేటర్ ఎన్నికల్లో 106 డివిజన్ల నుంచి టీడీపీ పోటీ చేసింది. కానీ, ఒక్కటంటే ఒక్క డివిజన్లో కూడా డిపాజిట్ దక్కక ఆ పార్టీ అభ్యర్థులు చతికిలపడిపోయారు.

  • 04 Dec 2020 07:44 PM (IST)

    గౌలిపురాలో బీజేపీ అభ్యర్థి విజయం..

    35 గౌలి పురా డివిజన్.. 

    బీజేపీ అభ్యర్థి అలె భాగ్యలక్ష్మి  - 9765+5702=15467 ఓట్లు

    తెరాస అభ్యర్థి బొద్దు సరిత - 2990+1620=4610 ఓట్లు

    కాంగ్రెస్ అభ్యర్ధి పి.గాయత్రి  - 348+244= 592 ఓట్లు

    బీజేపీ అభ్యర్థి అలె భాగ్యలక్ష్మి తన సమీప తెరాస అభ్యర్ధి బొద్దు సరితపై 10857 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

  • 04 Dec 2020 07:37 PM (IST)

    ఐ.ఎస్.సదన్ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి విజయం..

    38 ఐ.ఎస్.సదన్ డివిజన్

    తెరాస అభ్యర్థి. సామ స్వప్న సుందర్ రెడ్డి 6082+ 2439=8522 ఓట్లు

    బీజేపీ అభ్యర్థి శ్వేతా మధుకర్ రెడ్డి

    6821+ 4102 =10924 ఓట్లు

    కాంగ్రెస్ అభ్యర్ధి కే.మంజుల

    249+108=357 ఓట్లు

    బీజేపీ అభ్యర్థి శ్వేతా మధుకర్ రెడ్డి తన సమీప తెరాస అభ్యర్థి సామ స్వప్న సుందర్ రెడ్డిపై 2402 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

  • 04 Dec 2020 07:30 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటిన టీఆర్ఎస్.. రెండో స్థానంలో బీజేపీ..

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 47 స్థానాల్లో గెలుపొందింది. ఇంకా 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే ఎంఐఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించింది.

  • 04 Dec 2020 07:26 PM (IST)

    గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం..

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ కార్యాలయానికి పంపించారు. ఇక ఫలితాలపై  సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని ఉత్తమ్ వాపోయారు.

  • 04 Dec 2020 07:25 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల ఫలితాలు.. ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో సంబరాలు..

  • 04 Dec 2020 07:00 PM (IST)

    ఎల్ బీ నగర్ నియోజవర్గంలోని డివిజన్లను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ

    ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

  • 04 Dec 2020 06:58 PM (IST)

    సనత్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు...

    సనత్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి  లక్ష్మి రెడ్డి విజయం సాధించారు.

    బీజేపీ-9236

    టీఆర్ఎస్-11665

    కాంగ్రెస్-1435

    టీడీపీ-1033

    నోటా-191

    చెల్లని ఓట్లు -483

  • 04 Dec 2020 06:00 PM (IST)

    అమీర్‌పేట్ డివిజన్లో బీజేపీ గెలుపు...

    అమీర్‌పేట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి కేతినేని సరళ గెలుపొందారు. తన ప్రత్యర్థిపై 1301 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • 04 Dec 2020 05:56 PM (IST)

    మల్లాపూర్, మీర్పెట్ హెచ్‌బీ కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు...

    మల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవేందర్ రెడ్డి గెలుపొందారు. తన ప్రత్యర్థి పై 2600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి  ప్రభుదాస్ గెలిచారు. తన ప్రత్యర్థిపై  3839 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • 04 Dec 2020 05:45 PM (IST)

    శాలిబండ డివిజన్లో ఎంఐఎం గెలుపు

    శాలిబండ డివిజన్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ముస్తఫా అలీ ముజాఫర్ గెలుపొందారు. తన ప్రత్యర్థిపై 5000 ఓట్ల  మెజారిటీతో విజయం సాధించారు.

  • 04 Dec 2020 05:33 PM (IST)

    ఫతే నగర్, అల్లపూర్, బాలాజీ నగర్, కేపీహెచ్‌బీ డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపు...

    మూసాపెట్లో సర్కిళ్లోని మూసాపెట్ డివిజన్లో బీజేపీ గెలుపొందగా... మిగితా డివిజన్లైయిన బాలాజీ నగర్, కేపీహెచ్‌బీ, ఫతే నగర్, అల్లపూర్ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. బాలాజీ నగర్ డివిజన్ నుంచి  తెరాస అభ్యర్థి శిరీష 2886 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కేపీహెచ్‌బీ డివిజన్ నుంచి  టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావు 2010 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థిపై విజయ సాధించారు. ఫతే నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పండల సతీష్ గెలుపొందారు. అల్లపూర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సబియా గౌసుద్దీన్ విజయం సాధించారు. మూసా పెట్ డివిజన్ నుంచి  బీజేపీ అభ్యర్థి మహేందర్ 600 ఓట్ల మెజార్టీ తో తన ప్రత్యర్థిపై  గెలుపొందారు.

  • 04 Dec 2020 05:22 PM (IST)

    ఫలక్ నుమా సర్కిళ్లన్నీ ఎంఐఎం వశం...

    ఫలక్ నుమా సరిళ్ల పరిధిలోని 6 డివిజన్లలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

    ఫలక్ నామా డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థి తారా భాయ్ 17, 282 మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. నవాబ్ సాహెబ్ కుంటా డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థి షరీన్ ఖతూన్ 15,620 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. జహానుమా డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ అబ్దుల్ ముక్తాధీర్ విజయం సాధించాడు.  కిషన్ బాగ్ డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థి ఖాజా ముషఫరుద్దీన్ 9,632 ఓట్ల మెజారిటీ తో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు.  రాంనాస్థపురా డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖాదర్ గెలిచారు. ధూద్ బౌలీ డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ సలీమ్ 6,353 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.

  • 04 Dec 2020 05:07 PM (IST)

    ముసాపెట్లో బీజేపీ గెలుపు...

    ముసాపెట్ డివిజన్ బీజేపీ కైవసమైంది. భాజపా నుంచి పోటీ చేసిన మహేందర్ 600 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థిపై  గెలుపొందారు.

  • 04 Dec 2020 05:04 PM (IST)

    చర్లపల్లిలో టీఆర్ఎస్ గెలుపు...

    చర్లపల్లి డివిజన్ కారు కైవసమైంది. అక్కడ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

  • 04 Dec 2020 04:44 PM (IST)

    సైదాబాద్లో బీజేపీ, అజాంపురలో ఎంఐఎం, ముసారంగ్ బాగ్లో బీజేపీ గెలుపు....

    సైదాబాద్ డివిజన్ బీజేపీ వశమైంది. అక్కడ భాజపా అభ్యర్థి  కొత్త కాపు అరుణ గెలుపొందారు. ఓల్డ్  మలక్ పేటలో ఎంఐఎం అభ్యర్థి ఫాతిమా విజయం సాధించారు. ఇక అజాం పుర డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి  జహం నసీం గెలుపొందారు.  ముసారంగ్ బాగ్ నుంచి బీజేపీ అభ్యర్థి బొక్క భాగ్యలక్ష్మి విజయం సాధించారు. అక్బర్ బాగ్ డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థి మినాజోద్దీన్ గెలుపొందారు.

  • 04 Dec 2020 04:36 PM (IST)

    ఖైరతాబాద్ కారు కైవసం...

    ఖైరతాబాద్ డివిజన్ కారు కైవసమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి విజయ రెడ్డి గెలుపొందారు. ఇక, కేపీహెచ్బీ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావ్ విజయం సాధించారు.

  • 04 Dec 2020 04:34 PM (IST)

    బాలాజీ నగర్, నాచారంలో టీఆర్ఎస్ గెలుపు...

    బాలాజీ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పీ శిరీష తన ప్రత్యర్థిపై 2821 ఓట్ల మెజార్టీతో  గెలుపు పొందారు. అమీర్ పేట్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి సరళ విజయం సాధించారు. నాచారం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజైన్ శేఖర్ గెలుపొందారు. కాగా, రాంనగర్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

  • 04 Dec 2020 04:28 PM (IST)

    హబ్సిగూడలో బీజేపీ గెలుపు...

    హబ్సిగూడలో  భారతీయ జనతా పార్టీ అభ్యర్థి  కే. చేతన విజయం సాధించారు.

  • 04 Dec 2020 04:26 PM (IST)

    నాచారం, జగద్గిరిగుట్ట కారు కైవసం....

    నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతి సాయిజన్‌ గెలుపొందారు. ఇక, జగద్గిరిగుట్ట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్‌ విజయం సాధించారు.

  • 04 Dec 2020 04:23 PM (IST)

    అల్వాల్, చింతల్ డివిజన్లలో టీ‌ఆర్‌ఎస్ గెలుపు...

    చింతల్ డివిజన్లో టీ‌ఆర్ఎస్ అభ్యర్థి రషీదా బేగం గెలుపొందారు. ఆమె తన ప్రత్యర్థిపై 1923 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, అల్వాల్ డివిజన్ లో తెరాస అభ్యర్థి విజయశాంతి 1050 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 04 Dec 2020 04:12 PM (IST)

    చంపాపేట్లో బీజేపీ జయకేతనం...

    చంపాపేట్ డివిజన్ భారతీయ జనతా పార్టీ వశమైంది. భాజపా అభ్యర్థి వంగ మధుసూదన్ రెడ్డి గెలుపొందారు.

  • 04 Dec 2020 04:09 PM (IST)

    పఠాన్‌చెర్ డివిజన్లో ‌టీఆర్‌ఎస్ గెలుపు...

    పఠాన్ చెరు డివిజన్లో టీ‌ఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు.  తెరాస అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్ తన ప్రత్యర్థిపై 6086 ఓట్ల మెజార్టీ సాధించాడు.

  • 04 Dec 2020 04:01 PM (IST)

    కాప్రా కారు కైవసం... విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి....

    కాప్రా డివిజన్ కారు కైవసమైంది. టీ‌ఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్ కార్పొరేటర్‌గా గెలుపొందారు.

  • 04 Dec 2020 03:57 PM (IST)

    సూరారం డివిజన్ టీ‌‌ఆర్‌ఎస్ వశం... 2 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు....

    సురారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి సత్యనారాయణ గెలుపొందారు. తన ప్రత్యర్థిపై 2వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

  • 04 Dec 2020 03:49 PM (IST)

    అడిక్‌మెట్, ముషీరాబాద్లో బీజేపీ అభ్యర్థుల విజయం....

    గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది.

    అడిక్‌మెట్ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి సునితా ప్రకాశ్‌గౌడ్ విజయం సాధించగా... ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి సుప్రియా గౌడ్ గెలుపొందారు.

  • 04 Dec 2020 03:45 PM (IST)

    నవాబ్ సాహెబ్ కుంటాలో ఎంఐఎం గెలుపు..

    నవాబ్ సాహెబ్ కుంటాలో ఎంఐఎం అభ్యర్థి శరీన్ ఖాతూన్ గెలుపొందారు.

  • 04 Dec 2020 03:43 PM (IST)

    జహనుమా, రామాంసపురా డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు విజయం..

    గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటుతోంది. జహనుమా, రామాంసపురా డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు అబ్దుల్‌ ముక్తదీర్‌, అబ్దుల్‌ ఖాదీర్‌లు విజయం సాధించారు.

  • 04 Dec 2020 03:42 PM (IST)

    మల్కాజ్‌గిరి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపు...

    మల్కాజ్‌గిరి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై గెలుపొందారు.

  • 04 Dec 2020 03:41 PM (IST)

    దూద్‌బౌలి ఎంఐఎం అభ్యర్థి సలీం...

  • 04 Dec 2020 03:36 PM (IST)

    అంబర్‌పేట ఇండోర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత..

    అంబర్ పేట ఇండోర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఐఎం, ఎంబీటీ నేతల పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల నేతలను చెదరగొట్టారు.

  • 04 Dec 2020 03:34 PM (IST)

    ఫలక్‌నుమా సర్కిల్‌లోని ఆరు డివిజన్లలో గెలుపొందిన ఎంఐఎం అభ్యర్థులు..

    నవాబ్ సాహెబ్ కుంటా ఎంఐఎం. = 17543 తెరాస. = 1923 బీజేపీ. = 297 ఎంఐఎం అభ్యర్థి శరీన్ ఖతూన్ గెలుపు..

    ఫలక్‌నుమా

    ఎంఐఎం అభ్యర్థి తారా భాయ్ గెలుపు

    రాంనాస్థపురా ఎంఐఎం. = 15781 తెరాస. = 1668 బిజెపి. = 507

    ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖాదర్ గెలుపు..

    ధూద్ బౌలీ ఎంఐఎం = 9152 తెరాస. = 1185 బిజెపి. = 2799

    ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ సలీం గెలుపు..

    కిషన్ బాగ్ ఎంఐఎం = 11800 తెరాస. = 2168 బిజెపి. = 1848 ఎంఐఎం అభ్యర్థి ఖాజా ముషఫరుద్దీన్ గెలుపు

    జహానుమ

    ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ అబ్దుల్ గెలుపు

  • 04 Dec 2020 03:32 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల్లో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ..

    గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ్డ‌ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ అత్య‌ధిక డివిజ‌న్ల‌లో త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ముందంజ‌లో నిలుస్తోంది. గోల్నాక డివిజ‌న్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి దూస‌రి లావ‌ణ్య 7184 ఓట్ల‌తో ముందంజ‌లో కొన‌సాగుతూ.. గెలుపు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. బీజేపీ అభ్య‌ర్థి 5725 ఓట్ల‌తో రెండోస్థానంలో నిలువ‌గా..కాంగ్రెస్ 326 ఓట్ల‌తో మూడో స్థానంలో నిలిచింది.

    ఖైరతాబాద్ డివిజ‌న్ లో మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి విజయరెడ్డి 7261ఓట్ల‌తో ముందంజ‌లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి వీణ మాధురి 5201 ఓట్లు సాధించ‌గా..టీఆర్ఎస్ అభ్య‌ర్థి 2060 ఆధిక్యంలో ఉన్నారు. బంజారాహిల్స్ డివిజ‌న్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి 6122 ఓట్ల‌తో ముందంజ‌లో ఉన్నారు. బీజేపీ అభ్య‌ర్థి 4155 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ 1968 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అంబర్ పేట టిఆర్ఎస్ అభ్యర్థి విజయ్ కుమార్ గౌడ్ లీడ్ లో కొన‌సాగుతున్నారు. సోమాజిగూడ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి 2,458 లీడ్ లో ఉన్నారు.

  • 04 Dec 2020 03:32 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల్లో జోరు చూపిస్తున్న కారు..

    కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం 2025 మెజారిటీ ఓట్లతో గెలుపు

    భారతినగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధుఆదర్శ్ రెడ్డి 3900 ఓట్ల మెజారిటీతో గెలుపు

    సనత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కొలను లక్మి రెడ్డి 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించా

    వెంకటాపురం - సబితా కిశోర్( టీఆర్ఎస్)

    చింతల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రషీదా బేగం గెలుపు

    అల్వాల్ - చింతల విజయశాంతి టీఆర్ఎస్

    బాలనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆవుల రవీందర్‌ విజయం

    ఓల్డ్ బోయిన్‌పల్లి - ఎం నర్సింహయాదవ్(టీఆర్ఎస్)

  • 04 Dec 2020 03:31 PM (IST)

    చైతన్యపురి, గచ్చిబౌలిలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు..

    చైతన్యపురి - బీజేపీ అభ్యర్థి నర్సింహగుప్తా విజయం

    గచ్చిబౌలి బీజేపీ అభ్యర్థి గంగాధర్ రెడ్డి గెలుపు

  • 04 Dec 2020 03:30 PM (IST)

    సత్తా చాటుతున్న ఎంఐఎం అభ్యర్థులు..

    దత్తాత్రేయ నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి జాకిర్‌ బక్రీ గెలుపు

    సంతోష్‌నగర్ - ఎండీ ముజాఫర్ హుసేన్(ఎంఐఎం)

    తాలాబ్ చంచటం - సమీనా బేగం(ఎంఐఎం)

    రాంనాస్థపురా డివిజన్ - ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖాదర్ విజయం

  • 04 Dec 2020 03:22 PM (IST)

    ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో బీజేపీ ముందంజ..

    ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో బీజేపీ జోరు చూపిస్తోంది. 11 స్థానాల్లో కమలం పార్టీ ముందంజలో ఉంది.

    సరూర్ నగర్ - బీజేపీ ఆర్కే పురం - బీజేపీ

    చైతన్యపురి - బీజేపీ గడ్డిఅన్నారం - బీజేపీ కొత్తపేట - బీజేపీ

    నాగోల్ - బీజేపీ లీడ్ మన్సూరాబాద్ - బీజేపీ లీడ్ చెంపాపేట్ - బీజేపీ లీడ్ హయత్ నగర్ - బీజేపీ BN రెడ్డి - తెరాస లీడ్ వనస్థలిపురం - బీజేపీ హస్తినాపురం - బీజేపీ vs తెరాస లింగోజుగూడ - బీజేపీ

  • 04 Dec 2020 03:13 PM (IST)

    సనత్ నగర్ డివిజన్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయం...

    సనత్ నగర్ డివిజన్‌లో ముగిసిన కౌంటింగ్.. 

    ఓట్ల వివరాలు..

    బీజేపీ - 9236

    టీఆర్ఎస్ - 11665

    కాంగ్రెస్ - 1435

    టీడీపీ - 1033

    నోటా - 191

    చెల్లని ఓట్లు - 486

    టిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మిరెడ్డి 2429 ఓట్ల ఆధిక్యంతో గెలుపు.

  • 04 Dec 2020 03:11 PM (IST)

    నవాబ్ సాహెబ్ కుంటా ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా ఉన్నాయి...

    నవాబ్ సాహెబ్ కుంటాలో ఎంఐఎం అభ్యర్థి 17,543 షరీన్ ఖతూన్ గెలుపొందింది. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి...

    మొదటి రౌండ్..

    ఎంఐఎం. = 11907 తెరాస. = 1317 బీజేపీ. = 297 నోటా = 73

    రెండో రౌండ్...

    ఎంఐఎం = 5636 తెరాస = 606 బీజేపీ = 114 నోటా = 28

  • 04 Dec 2020 03:08 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు.. సనత్ నగర్, వెంకటాపూర్, భారతీనగర్‌లలో తెరాస అభ్యర్థులు విజయం

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగిస్తోంది. సనత్ నగర్, వెంకటాపూర్, భారతీనగర్‌లలో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. సనత్ నగర్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి కే. లక్ష్మి 2429 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అలాగే భారతినగర్‌లో తెరాస అభ్యర్థి సింధు ఆదర్శరెడ్డి  తమ సమీప బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డిపై 4601 మెజారిటీతో గెలుపు

  • 04 Dec 2020 03:08 PM (IST)

    గ్రేటర్ ఎన్నికలు.. 10 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం..

    గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగిస్తోంది. ప్ర‌స్తుతం 70 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 10 స్థానాల్లో గెలుపొందింది. యూసుఫ్‌గూడ‌లో రాజ్ కుమార్ ప‌టేల్‌, మెట్టుగూడ‌లో సునీత‌, హైద‌ర్‌న‌గ‌ర్‌లో నార్నె శ్రీనివాస్ రావు, స‌న‌త్‌న‌గ‌ర్‌లో ల‌క్ష్మీ, కుత్బుల్లాపూర్‌లో పారిజాత గౌరీష్ గౌడ్‌, రంగారెడ్డి న‌గ‌ర్‌లో విజ‌య్ శేఖ‌ర్, బోర‌బండ‌లో బాబా ఫ‌సీయుద్దీన్‌, భార‌తీ న‌గ‌ర్‌లో సింధూ ఆద‌ర్శ్ రెడ్డి, బాలాన‌గ‌ర్‌లో ఆవుల ర‌వీంద‌ర్ రెడ్డి, చింత‌ల్ డివిజ‌న్‌లో ర‌షీదా బేగం విజ‌యం సాధించింది.

  • 04 Dec 2020 03:08 PM (IST)

    రాంనాస్థపురాలో ఎంఐఎం అభ్యర్థి విజయం..

    రాంనాస్థపురాలో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖాదర్ విజయం సాధించారు. ఇక ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ఎంఐఎం - 15781 తెరాస - 1668 బిజెపి - 507

  • 04 Dec 2020 03:01 PM (IST)

    మల్కాజ్‌గిరి ఆరు డివిజన్లలో లీడ్స్ వివరాలు...

    136 నేరేడ్మెట్ డివిజన్ - టి.ఆర్.ఎస్ లీడ్,

    137 వినాయక నగర్ డివిజన్లో - బిజెపి లీడ్.

    138 మౌలాలి - బిజెపి లీడ్.

    139 ఈస్ట్ ఆనంద్ బాగ్ - టి.ఆర్.ఎస్ లీడ్

    140 మల్కాజిగిరి డివిజన్- బిజెపి లీడ్.

    141 గౌతం నగర్ డివిజన్- టి.ఆర్.ఎస్ లీడ్.

  • 04 Dec 2020 02:53 PM (IST)

    ముషీరాబాద్ సర్కిల్ ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా ఉన్నాయి..

    ముషీరాబాద్ సర్కిల్ లీడ్స్.. 

    ఆదిక్మెట్ - బీజేపీ

    ముషీరాబాద్ - బీజేపీ

    రామ్ నగర్ - బీజేపీ

    బోల్కాపూర్ - ఎంఐఎం

    గాంధీ నగర్ - బీజేపీ

    కావడిగూడ - బీజేపీ

  • 04 Dec 2020 02:47 PM (IST)

    ఫలక్‌నామా సర్కిల్‌లోని 6 డివిజన్ల ఫలితాలు...

    ఫలక్‌నామా సర్కిల్‌లోని 6 డివిజన్ల ఫలితాలు  ఇలా ఉన్నాయి...

    నవాబ్ సాహెబ్ కుంటా :ఎంఐఎం అభ్యర్థి షరీన్ ఖాతున్ గెలుపు

    ఫలక్‌నామా: ఎంఐఎం అభ్యర్థి తారా భాయ్ గెలుపు

    రాంనాస్థపురా: ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖాదర్ గెలుపు

    ధూద్ బౌలీ: ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ సలీం గెలుపు

    కిషన్ బాగ్: ఎంఐఎం అభ్యర్థి ఖాజా ముషఫరుద్దీన్ గెలుపు

    జహానుమ: ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ అబ్దుల్ గెలుపు

  • 04 Dec 2020 02:42 PM (IST)

    తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంబరాలు

    తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యతను చాటుతూ వస్తుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. లెక్కింపుకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఊహించినట్టుగానే మేయర్‌ పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందని సంబరపడిపోతున్నారు.

  • 04 Dec 2020 02:23 PM (IST)

    గ్రేటర్​ ఫలితాల్లో ఎంఐఎం జోరు

    తలాబ్​చంచలం సమీనా బేగం విజయం

    సంతోశ్​నగర్ మహమ్మద్ ముజాఫిర్ హుస్సేన్ విజయం

    రాంనాస్‌పురాలో మహ్మద్ ఖదీర్‌ గెలుపు

    దూద్‌బౌలిలో  మహ్మద్ సలీం విజయం

    రియాసత్‌నగర్‌లో మీర్జా ముస్తఫా బేగ్ గెలుపు

    బార్కాస్‌లో షబానా బేగం విజయం

    మెహదీపట్నంలో మాజిద్ హుస్సేన్ గెలుపు

  • 04 Dec 2020 02:09 PM (IST)

    శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం..

    శేరిలింగంపల్లి లో టీఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ 1421 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 Dec 2020 02:08 PM (IST)

    ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందిన డివిజన్లు ఇవే...

    ఏఐఎంఐఎం అభ్యర్థులు గెలుపొందిన డివిజన్ల వివరాలు ఇలా ఉన్నాయి...

    దబీర్‌పురా,

    రామనస్పురా,

    దూద్‌బౌలి,

    కిషన్ బాగ్,

    నవాబ్ సహాబ్ కుంటా,

    బార్కాస్,

    పాటర్గట్టి,

    పురానాపూల్,

    రియస్ట్నగర్,

    అహ్మద్ నగర్

  • 04 Dec 2020 02:03 PM (IST)

    ధూద్ బౌలీ, కిషన్ బాగ్ డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు విజయం..

    ధూద్ బౌలీ, కిషన్ బాగ్ డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. దూద్‌బౌలిలో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ సలీం విజయం సాధించగా.. కిషన్ బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి ఖాజా ముషఫరుద్దీన్ విజయం సాధించారు.

  • 04 Dec 2020 01:53 PM (IST)

    రామచంద్రపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం..

    రామచంద్రపురం 112 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేష్ యాదవ్ 5759 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • 04 Dec 2020 01:52 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్.. రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు..

    గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది.  మంగళ్‌హాట్‌లో బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు. అలాగే హయత్ నగర్ డివిజన్ నుంచి నవ జీవన్ రెడ్డి గెలుపొందారు.

  • 04 Dec 2020 01:39 PM (IST)

    ఎల్‌బీ నగర్ సర్కిల్ లో బీజేపీ ముందంజ..

    ఎల్‌బీ నగర్ సర్కిల్ లో బీజేపీ ముందంజ..

    సరూర్ నగర్ - తెరాస ఆర్కే పురం - బీజేపీ చైతన్యపురి - బీజేపీ గడ్డి అన్నారం - బీజేపీ కొత్తపేట - తెరాస నాగోల్ - బీజేపీ లీడ్ BN రెడ్డి - తెరాస లీడ్ మన్సూరాబాద్ - బీజేపీ లీడ్ చెంపాపేట్ - బీజేపీ లీడ్

  • 04 Dec 2020 01:26 PM (IST)

    కిషన్ బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి విజయం..

    కిషన్‌బాగ్‌లో ఎంఐఎం విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా తన సమీప బీజేపీ అభ్యర్థి బండారి నవీన్ కుమార్‌పై  గెలుపొందారు.

  • 04 Dec 2020 01:21 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్.. వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు.. వివరాలు ఇవే..

    ప్రస్తుతం 19 స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 25 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే 12 స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

  • 04 Dec 2020 01:17 PM (IST)

    బార్కస్‌లో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య ఘర్షణ...

    బార్కస్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

  • 04 Dec 2020 01:16 PM (IST)

    చార్మినార్ సర్కిల్‌లో ఓట్ల లెక్కింపు ఆలస్యం...

    చార్మినార్ సర్కిల్‌లోని పత్తర్‌గట్టి, మొగల్పురా, శాలిబండ, ఘంసి బజార్, పురానాపూల్ డివిజన్లలో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో ఆలస్యం కానుంది.

  • 04 Dec 2020 01:15 PM (IST)

    గ్రేటర్‌లో వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు.. 22 స్థానాల్లో బీజేపీ ముందంజ..

    గ్రేటర్ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటిదాకా 17 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. 22 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక 7 స్థానాల్లో ఎంఐఎం, రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

  • 04 Dec 2020 01:14 PM (IST)

    గ్రేటర్‌లో వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు.. 15 స్థానాల్లో తెరాస ఆధిక్యం..

    గ్రేటర్ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటిదాకా 15 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. 18 స్థానాల్లో బీజేపీ, 6 స్థానాల్లో ఎంఐఎం, ఒక్క స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

  • 04 Dec 2020 01:11 PM (IST)

    టీఆర్ఎస్, ఎంఐఎం చెరో రెండు స్థానాల్లో విజయం.. కొన్ని చోట్ల టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీ..

    ఇప్పటి వరకూ టీఆర్ఎస్ రెండు స్థానాల్లో, ఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించాయి. బ్యాలెట్ ఓట్లతో మొదట దూసుకెళ్లిన బీజేపీ.. ఆ తర్వాత వెనుబడింది. అయితే కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ 57 స్థానాల్లో ఆధిక్యంగా ఉండగా.. బీజేపీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఎంఐఎం 19 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఇక టీడీపీ కానీ.. ఇతరులు కానీ దరిదాపుల్లో కూడా లేరు.

  • 04 Dec 2020 01:09 PM (IST)

    జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్.. కాంగ్రెస్‌ ఖాతాలో ఏఎస్‌ రావు నగర్‌..

    జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.

  • 04 Dec 2020 01:04 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల ఫలితాలు.. టీఆర్ఎస్‌, ఎంఐఎం చెరో రెండు సీట్ల‌లో విజ‌యం..

    జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. మొద‌టి రౌండ్ ముగిసేస‌రికి టీఆర్ఎస్‌, ఎంఐఎం చెరో రెండు సీట్ల‌లో విజ‌యం సాధించాయి. మెహ‌దీప‌ట్నంలో ఎంఐఎం అభ్య‌ర్థి, మాజీ మేయ‌ర్ మాజిద్ హుస్సేన్, డ‌బీర్‌పురాలో అలందార్ హుస్సేన్‌ఖాన్ విజ‌యం సాధించారు.

    కాగా, టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో రాజ్‌కుమార్ ప‌టేల్‌, మెట్టుగూడ‌లో సునీత ఘ‌న విజ‌యం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ 60 డివిజ‌న్ల‌లో ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. మ‌రో 30 డివిజ‌న్ల‌లో ఎంఐఎం దూసుకుపోతున్న‌ది. 5 డివిజ‌న్ల‌లో బీజేపీ, 3 డివిజ‌న్ల‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి.

  • 04 Dec 2020 01:01 PM (IST)

    అంబర్‌పేట్ సర్కిల్‌లో ఆలస్యం అవుతున్న కౌంటింగ్ ప్రక్రియ...

    అంబర్‌పేట్ సర్కిల్‌లోని సైదాబాద్, ముసరాంబాగ్. ఓల్డ్ మలక్‌పేట్, అక్బర్ బాగ్, అజంపుర, చావని, దబీర్‌పురలలో కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. మొదటి రౌండ్ కౌంటింగ్ కావడానికి ఇంకా గంట సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • 04 Dec 2020 12:42 PM (IST)

    శేరిలింగంపల్లి డివిజన్ తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం..

    శేరిలింగంపల్లి డివిజన్ తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరుస్తోంది. కాగా, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల తొలి రౌండ్‌లో భాజపా ఆధిక్యంలో ఉంది.

  • 04 Dec 2020 12:40 PM (IST)

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ.. రెండు స్థానాల్లో విజయం..

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టగూడ, యూసఫ్ గూడలలో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసురి సునిత గెలుపొందారు. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఘన విజయం సాధించారు. అయితే ఎంత మెజార్టీతో గెలుపొందారనే దానిపై అధికారికంగా ఎన్నికల అధికారులు ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం 21 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ-15 స్థానాల్లో, కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో మాత్రం ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, సనత్‌నగర్‌తో పాటు పలు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుకు దగ్గరలో ఉన్నారు. మరికొన్ని స్థానాల్లో బీజేపీ-టీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నాయి.

  • 04 Dec 2020 12:40 PM (IST)

    జీహెచ్ఎంసీ ఎన్నికల తొలి ఫలితం వెల్లడి.. గ్రేటర్‌లో బోణీ కొట్టిన ఎంఐఎం

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. ఈయన గ్రేటర్ మాజీ మేయర్‌. కాగా.. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంఐఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం దరిదాపుల్లో కూడా లేవు.

  • 04 Dec 2020 12:26 PM (IST)

    వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ పరిశీలన

  • 04 Dec 2020 12:23 PM (IST)

    యూసఫ్‌గూడలో టీఆర్ఎస్ గెలుపు..

    యూసఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ విజయం సాధించారు. బాలాజీనగర్, పటాన్‌చెరు, రామచంద్రపురం, భారతీనగర్‌, వెంకటాపురం తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం కనబరుస్తోంది.

  • 04 Dec 2020 12:17 PM (IST)

    వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు

    బాలాజీనగర్  పటాన్‌చెరు, రామచంద్రపురం, భారతీనగర్‌, వెంకటాపురం,  తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 04 Dec 2020 12:13 PM (IST)

    గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ ఫలితాలు వచ్చేశాయి..

    గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. మెహదీపట్నంలో ఎంఐఎం బోణీ కొట్టింది.  టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్సీపురం, పటాన్‌చెరు, చందానగర్‌, చర్లపల్లిలో గులాబీ జెండా ఎగురుతోంది. జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, బాలానగర్‌, కాప్రాలోనూ కారు జోరు చూపుతోంది. అలాగే మీర్‌పేట్ హెచ్‌బీకాలనీ, గచ్చిబౌలి, భారతీనగర్‌, శేరిలింగంపల్లి, గాజులరామారం, రామచంద్రాపురంలోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది.

    మరికొన్ని డివిజన్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. గడ్డిఅన్నారం, చైతన్యపురి, ఆర్కేపురం, సరూర్‌నగర్‌లో కాషాయ జెండా ఎగురుతోంది. హయత్‌నగర్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. అటు పాతబస్తీలో ఎంఐఎం జెండా ఎగురుతోంది. పలు డివిజన్లలో ఎంఐఎం ముందంజలో ఉంది. మెహదీపట్నంలోనూ మజ్లిస్‌ దూసుకెళ్తోంది.

    గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలిరౌండ్‌లో 150 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్‌ 42, బీజేపీ 18, ఎమ్‌ఐఎమ్‌ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 04 Dec 2020 11:59 AM (IST)

    నెమ్మదిగా సాగుతోన్న కౌంటింగ్

    గ్రేటర్ కౌంటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని డివిజన్ల ఫలితాలు వస్తాయని అంచనాలున్నా.. ఆలస్యమైంది. బ్యాలెట్‌ పేపర్‌కు తోడు.. సిబ్బంది అవగాహన రాహిత్యంతో అలస్యమైనట్లు తెలుస్తోంది. ఏజెంట్లకు సైతం.. సరైన అవగాహన లేనట్లు సమాచారం. ఎన్నికల విధులకు టీచర్లు దూరంగా ఉన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బంది బ్యాలెట్‌ పేపర్లను కట్టలు కట్టడంలో తడబాటు పడుతున్నట్లు తెలుస్తోంది.

  • 04 Dec 2020 11:58 AM (IST)

    వివేకానంద నగర్ డివిజన్‌‌లో పార్టీల ఏజెంట్లు ఆందోళన వివరణ..

    కూకట్‌పల్లి వివేకానంద నగర్ డివిజన్‌ కౌంటింగ్‌లో అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగిన పార్టీల నేతలు విరమించుకున్నారు. పోల్ అయిన ఓట్ల కంటే అధికంగా ఓట్ల మొత్తాన్ని నమోదు చేసారంటూ పార్టీల నేతలు ఆందోళన దిగగా.. దీనిపై ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు.

  • 04 Dec 2020 11:53 AM (IST)

    ఫలక్‌నామా సర్కిల్‌లో దూసుకుపోతున్న ఎంఐఎం..

    ఫలక్‌నామా సర్కిల్‌లోని ఆరు డివిజన్లలో ఎంఐఎం ఆధిక్యత కొనసాగుతోంది.

  • 04 Dec 2020 11:52 AM (IST)

    కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది, గెలిచినవారు ర్యాలీలు చెయ్యవద్దు : సీపీ సజ్జనార్

  • 04 Dec 2020 11:43 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వివరాలు.. బీజేపీ 88 చోట్ల ఆధిక్యం..

    పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మొత్తంగా బీజేపీ 88 చోట్ల ఆధిక్యం కనబరిచింది. అలాగే టీఆర్ఎస్ 31 చోట్లు ఆధిక్యంలో ఉండగా.. ఎంఐఎం 16 చోట్లు ఆధిక్యంలో ఉంది. కాగా, 15 డివిజన్లలో ఏ పార్టీ కూడా సరైన ఆధిక్యం దక్కలేదు.

  • 04 Dec 2020 11:40 AM (IST)

    వివేకానంద నగర్ కాలనీ డివిజన్‌ లెక్కింపు కేంద్రంలో ఏజెంట్ల ఆందోళన..

    వివేకానంద నగర్ కాలనీ డివిజన్‌ లెక్కింపు కేంద్రంలో భాజపా ఏజెంట్ ఏకాంత్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. పోలైన ఓట్ల కంటే ఆధికంగా ఓట్లు ఉండటమే కారణమని తెలుస్తోంది. బూత్ నంబరు 63లో పోలైన ఓట్ల కంటే 219 ఎక్కువగా ఉన్నాయని.. అలాగే బ్యాలెట్ బాక్సులో 355 ఓట్లకు గాను 574 ఓట్లు ఉండటంపై బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • 04 Dec 2020 11:37 AM (IST)

    ఎల్‌బి నగర్‌లో సీపీ అంజనీ కుమార్ పర్యటన

  • 04 Dec 2020 11:33 AM (IST)

    మౌలాలి డివిజన్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఓ బ్యాలెట్ బాక్స్‌లో అధికంగా ఉన్న ఓట్లు..

    మౌలాలి డివిజన్‌లోని ఓ బ్యాలెట్ బాక్సులో ఓట్లు అధికంగా ఉండటంతో సిబ్బంది కౌంటింగ్‌ను నిలిపివేశారు. అనుకున్న దాని కంటే 33 ఓట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. ఆ బ్యాలెట్ బాక్స్‌లో మొత్తం 361 ఓట్లకు గాను 394 ఓట్లు ఉండటంతో కౌంటింగ్ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

  • 04 Dec 2020 11:30 AM (IST)

    కూకట్‌పల్లి కౌంటింగ్ సెంటర్‌లో బీజేపీ ఏజెంట్ల ఆందోళన...

    కూకట్‌పల్లి రిషి ఉమెన్స్ కాలేజీ కౌంటింగ్ సెంటర్‌లో బీజేపీ ఏజెంట్ల ఆందోళన చేస్తున్నారు. వివేకానందనగర్ డివిజన్ 63 పోలింగ్ బూత్‌లో పోల్ అయిన ఓట్ల కంటే ఇవాళ ఎక్కువ ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల రోజు ఈ బూత్‌లో355 ఓట్లు పోల్ కాగా.. ఇవాళ 574 ఓట్లు పోల్ అయినట్టు చూపించారు. దీనితో పోలింగ్ సిబ్బందితో బీజేపీ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. కాగా, బీజేపీ ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగానే గొడవ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు.

  • 04 Dec 2020 11:24 AM (IST)

    ఖైరతాబాద్ జోన్ సనత్ నగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు...

    ఖైరతాబాద్ జోన్ సనత్ నగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు...

    98.అమీర్ పేట్ డివిజన్ టీఆర్ఎస్...3 బీజేపీ...1 చెల్లని ఓట్లు-1 మొత్తం-5

    100 సనత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్....1 బీజేపీ...3 మొత్తం-4

    97.సోమాజిగూడ డివిజన్ టీఆర్ఎస్...1 బీజేపీ...3 చెల్లని ఓట్లు-1 మొత్తం-5

    91 ఖైరతాబాద్ డివిజన్ టీఆర్ఎస్....3 బీజేపీ.....6 చెల్లని ఓట్లు-1 మొత్తం 10

  • 04 Dec 2020 11:23 AM (IST)

    రాజేంద్రనగర్‌లో ప్రశాంతంగా కొనసాగుతోన్న కౌంటింగ్

  • 04 Dec 2020 11:21 AM (IST)

    మెహదీపట్నంలో తొలి ఫలితం వచ్చే అవకాశం...

    మెహదీపట్నంలో తొలి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ డివిజన్‌లో అత్యల్పంగా 11,818 ఓట్లు పోలైనందున ఫలితం తొందరగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • 04 Dec 2020 11:21 AM (IST)

    కోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ పిటిషన్ దాఖలు..

    కోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని కోరింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మరోసారి పునఃపరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

  • 04 Dec 2020 11:17 AM (IST)

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతివ్వండి: హైకోర్ట్

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ పలు కౌంటింగ్ సెంటర్ల వద్దకు మీడియాను అనుమతించని పరిస్థితి ఏర్పడింది. కౌంటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారాన్ని పలువురు మీడియా ప్రతినిధులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన కోర్టు మీడియా ప్రతినిధులకు అనుకూలంగా ఆదేశాలు జారీచేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు మీడియాను అనుమతించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్‌‌ను హైకోర్టు ఆదేశించింది.

  • 04 Dec 2020 11:17 AM (IST)

    నిజాం కాలేజ్ కౌంటింగ్ కేంద్రంలో పార్టీ ఏజెంట్ల ఆందోళన

    నిజాం కాలేజ్ కౌంటింగ్ కేంద్రంలో పార్టీ ఏజెంట్ల ఆందోళన చేస్తున్నారు. కౌంటింగ్ హాల్ లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవంటూ వారు ఆరోపిస్తున్నారు. మంచి నీళ్లు తాగేందుకు కౌంటింగ్ హాల్ నుండి గ్రౌండ్ వరకు వచ్చి తగాల్సి వస్తుందని, వాష్ రూమ్‌లో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పార్టీ ఏజెంట్లు చెబుతున్నారు.

  • 04 Dec 2020 11:10 AM (IST)

    కాసేపట్లో వెలువడనున్న తొలి రౌండ్ ఫలితాలు..

    జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరికాసేపట్లో తొలి రౌండ్ ఫలితాలు వెలువడనున్నాయి.

  • 04 Dec 2020 11:08 AM (IST)

    సంతోష్ నగర్‌లో కౌంటింగ్ ప్రాంతాన్ని సందర్శించిన అదనపు కమిషనర్

    హైదరాబాద్ పాతబస్తీ మహావీర్ కాలేజీలో సంతోష్ నగర్ సర్కిల్ 7 లో కౌంటింగ్ ప్రాంతాన్ని అదనపు కమిషనర్ డి.స్.చౌహన్ సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా బందోబస్తు కొనసాగుతుందని, శాంతి భద్రతుల పట్ల భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు.

    Also Read :

    GHMC Election Result 2020 : వందకుపైగా స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుంది : కవిత

    GHMC Elections Results 2020:కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగుల ధర్నా..మరికాసేపట్లో అసలు లెక్కలు..

  • 04 Dec 2020 11:07 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివరాలు.. 85 చోట్ల బీజేపీ, 29 చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యం..

    ప్రస్తుతం పలు చోట్ల పూర్తైన పోస్టల్ ఓట్ల లెక్కింపు వివరాల్లోకి వెళ్తే.. 85 చోట్ల భాజపాకు ఆధిక్యం రాగా.. 29 చోట్ల తెరాస, 17 చోట్ల ఎంఐఎం, 2 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.

  • 04 Dec 2020 10:58 AM (IST)

    కుత్‌బుల్లాపూర్‌లో ప్రశాంతంగా కొనసాగుతోన్న కౌంటింగ్

  • 04 Dec 2020 10:53 AM (IST)

    జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం

    జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం

    బూత్ నెంబర్ 8లో పోలైన ఓట్లు 471

    బాక్స్ లో కనిపిస్తున్నది మాత్రం 257 ఓట్లు మాత్రమే..

    మిగతా ఓట్ల గల్లంతుపై బీజేపీ అభ్యంతరం

    బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామంటున్న అధికారులు..

  • 04 Dec 2020 10:52 AM (IST)

    ఫలితాల ట్రెండ్స్‌పై రాజా సింగ్ కామెంట్స్

  • 04 Dec 2020 10:44 AM (IST)

    చార్మినార్ సర్కిల్ ఓట్ల లెక్కింపు విజువల్స్

  • 04 Dec 2020 10:41 AM (IST)

    శేరిలింగంపల్లి జోన్: కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసిన అధికారులు..

    శేరిలింగంపల్లి జోన్‌లోని కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను అధికారులు గాలికి వదిలేశారు. చందానగర్‌ PJR స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రంలో మాస్క్‌లు లేకుండానే కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. దీనితో వారిపై కౌంటింగ్ ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 04 Dec 2020 10:34 AM (IST)

    ఫలక్‌నామా సర్కిల్‌లోని పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    ఫలక్‌నామా సర్కిల్‌లోని పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    జహ్నుమా : ఏఐఎంఐఎం-1

    నవాబ్ సాహబ్ కుంటా: ఎంఐఎం-3

    రామ్నస్థాపురా : ఎంఐఎం-4

    దూద్‌బౌలి‌ : ఎంఐఎం-3, టీఆర్ఎస్-1

    కిషన్‌బాగ్  : ఎంఐఎం-3, టీఆర్ఎస్-1, బీజేపీ-2

    ఫలక్‌నామా: ఎంఐఎం-2

  • 04 Dec 2020 10:30 AM (IST)

    కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసిన అధికారులు

    కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను  అధికారులు గాలికి వదిలేశారు. చందానగర్ లోని పీజేఆర్ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రంలో మాస్క్ లు లేకుండానే సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొన్నారు. సిబ్బంది తీరుపై  కౌంటింగ్ ఏజెంట్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 04 Dec 2020 10:26 AM (IST)

    మైలార్‌దేవ్‌లపల్లిలో ప్రశాంతంగా జరుగతోన్న కౌంటింగ్‌

  • 04 Dec 2020 10:21 AM (IST)

    చార్మినార్ జోన్‌లోని ఓట్ల లెక్కింపు వివరాలు..

    లాలితాబాగ్ 36 డివిజన్ టిఆర్ఎస్ - 1 బిజెపి - 3 మొత్తం - 4

    రియాసత్ నగర్ 40 డివిజన్ టిఆర్ఎస్ - 1 బిజెపి - 2 ఎం ఐఎం - 3 మొత్తం - 6

    కంచన్ బాగ్ 41 డివిజన్ బిజెపి2 ఎం ఐఎం 1 మొత్తం - 3

    బార్కస్ 42 డివిజన్. మొత్తం 0

    చాంద్రాయణగుట్ట 43 డివిజన్

    టిఆర్ఎస్ 1 ఎం ఐఎం 1 మొత్తం 2

    ఉప్పుగూడ 44 డివిజన్ బిజెపి 5 ఎం ఐ ఎం 4 నోటా 1 మొత్తం 11

    జంగమేట్ 45 డివిజన్ బిజెపి 6 ఎం ఐ ఎం 1 రిజెక్ట్ 5 మొత్తం 12

  • 04 Dec 2020 10:17 AM (IST)

    రాజేంద్రనగర్ డివిజన్ కౌంటింగ్ వివరాలు..

    వార్డు నెంబర్ 57.సులేమన్ నగర్

    బీజేపీ - 1 టీఆర్ఎస్ - 1 రిజెక్ట్ -1

    వార్డు నెంబర్ 59 మైలార్ దేవరంపల్లి

    టీఆర్ఎస్ 2 బీజేపీ 2 కాంగ్రెస్ 1 ఇండిపెండెంట్1 రిజెక్ట్ 7

    వార్డ్ నెంబర్ 61 అత్తాపూర్ పోస్టల్ బ్యాలెట్

    టీఆర్ఎస్ 3 బీజేపీ 8 రిజెక్ట్ 2

    వార్డ్ నెంబర్ 58.శాస్ట్రిపురం ఎంఐఎం 1 కాంగ్రెస్ 1

  • 04 Dec 2020 10:12 AM (IST)

    రాజేంద్రనగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు.. ఆధిక్యంలో బీజేపీ..

    రాజేంద్రనగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు...  టీఆర్ఎస్ 2 బీజేపీ 16 కాంగ్రెస్ 1 చెల్లని ఓట్లు 1

  • 04 Dec 2020 10:11 AM (IST)

    మియాపూర్ లోని సెంటియా గ్లోబల్ స్కూల్ కౌంటింగ్ సెంటర్‌కు వచ్చిన సీపీ సజ్జనార్

  • 04 Dec 2020 10:10 AM (IST)

    సనత్ నగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    ఖైరతాబాద్ జోన్ మున్సిపల్ కాంప్లెక్స్ సనత్ నగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    98.అమీర్ పేట్ డివిజన్

    టీఆర్ఎస్...3

    బీజేపీ...1

    100సనత్ నగర్ డివిజన్

    టీఆర్ఎస్....1

    బీజేపీ...3

    97.సోమాజిగూడ డివిజన్

    టీఆర్ఎస్...1

    బీజేపీ...3

    91ఖైరతాబాద్ డివిజన్

    టీఆర్ఎస్....1

    బీజేపీ.....3

  • 04 Dec 2020 10:09 AM (IST)

    ఎస్ఈసీ సర్క్యులర్‌ను కొట్టివేసిన హైకోర్టు

    ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్‌ సహా ఇతర గుర్తును ఓటుగా లెక్కించాలని ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వస్తిక్‌ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణింపబడుతుందని చెప్పింది. జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి జారీ చేసిన ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టులో బీజేపీ పిటిషన్‌ వేసింది. ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

  • 04 Dec 2020 10:07 AM (IST)

    మలక్‌పేట నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    మలక్‌పేట నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    సైదాబాద్ డివిజన్... బీజేపీ  30 టీఆర్ఎస్   06

    మూసారాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ . 04 బీజేపీ 04 కాంగ్రెస్. 01

    ఓల్డ్  మలక్‌పేట డివిజన్ టీఆర్ఎస్ 01

    అక్బెర్ బాగ్ డివిజన్ నిల్ ..

    అజ్జాంపూర్ ఎంఐఎం. 02 ఇండిపెండెంట్. 01

    చావని డివిజన్ బీజేపీ. 02

  • 04 Dec 2020 09:56 AM (IST)

    కూకట్‌పల్లి జోన్‌లో 22 డివిజన్ల పోస్టల్ బ్యాలెట్ ఫలితాల వివరాలు..

    కూకట్‌పల్లి జోన్‌లో 22 డివిజన్ల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఇలా ఉన్నాయి.. ఇందులో 190 పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ 72 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా TRS 59 పోస్టల్ ఓట్లు వచ్చాయి.

  • 04 Dec 2020 09:53 AM (IST)

    అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి...

    అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి...

    133 పోస్టల్ బ్యాలెట్: బీజేపీ 5, టీఆరెస్ 2, నోటా1, రిజెక్టేడ్ 10.

    134 పోస్టల్ బ్యాలెట్: బీజేపీ5, టీఆరెస్3, రిజెక్టేడ్9.

    135 పోస్టల్ బ్యాలెట్:  బీజేపీ2, టీఆరెస్1, రిజెక్టేడ్4.

    అల్వాల్ సర్కిల్ మూడు డివిజన్లలో మొత్తం 42 ఓట్లు నమోదు. కాగా బిజెపికి 12, టీఆరెస్ 6, నోటాకీ 1 వచ్చాయి.

  • 04 Dec 2020 09:51 AM (IST)

    కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ.. పలు డివిజన్లలో ఓట్ల వివరాలు..

    లలితాబాగ్ 04 (బీజేపీ 3.తెరాస 1) రియాసత్ నగర్ 06(బీజేపీ 2. ఎంఐఎం 3. తెరాస 1)

    కంచంబాగ్ 03( బీజేపీ2. ఎంఐఎం 1 )

    బార్కస్ 00 (00)

    చాంద్రాయణగుట్ట 02 (తెరాస 1. ఎంఐఎం 1)

    ఉప్పుగూడ 12 (బీజేపీ5. ఎంఐఎం 4 నోటా 01)

    జంగంమెట్  12 బీజేపీ( 6. ఎంఐఎం 7 రిజెక్ట్ 5)

    చంద్రయణగుట్ట సర్కిల్8 మొతం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 39

  • 04 Dec 2020 09:48 AM (IST)

    రాజేంద్రనగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు...

    రాజేంద్రనగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు...  టీఆర్ఎస్- 2 బీజేపీ- 16 కాంగ్రెస్- 1 చెల్లని ఓట్లు 1

  • 04 Dec 2020 09:48 AM (IST)

    ఓల్డ్ సిటీలో ప్రశాంతంగా కొనసాగుతోన్న కౌంటింగ్

  • 04 Dec 2020 09:47 AM (IST)

    కూకట్‌పల్లి సర్కిల్ ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ..

    కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తయింది. దీనితో కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఒక్కో టేబుల్ దగ్గర వెయ్యి ఓట్ల చొప్పున 14 టేబుల్‌లలో 14వేల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.

  • 04 Dec 2020 09:44 AM (IST)

    మలక్‌పేట్‌లోని కౌంటింగ్ సెంటర్‌లో గందరగోళం.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..

    మలక్‌పేట్ నియోజకవర్గంలోని కౌంటింగ్ సెంటర్‌లో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ సెంటర్ లోపల స్పేస్ లేకపోవడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది. నాలుగు డివిజన్‌లకు సరిపడే కౌంటింగ్ స్పేస్ ఉన్న చోట 7 డివిజన్‌లకు సంబంధించి కౌంటింగ్ చేస్తున్న సిబ్బంది. ఇంకో 20నిమిషాల తర్వాత ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

  • 04 Dec 2020 09:42 AM (IST)

    అత్యంత భద్రత నడుమ కౌంటింగ్ సాగుతుందన్న సీపీ సజ్జనార్

  • 04 Dec 2020 09:36 AM (IST)

    నిజాం కాలేజ్ వద్ద కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ అంజనీ కుమార్

  • 04 Dec 2020 09:36 AM (IST)

    గాంధీనగర్ డివిజన్‌లో పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్‌లో పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఓట్లు 10

    బీజేపీ...7

    టీఆర్ఎస్...2

    నోటా...1

  • 04 Dec 2020 09:35 AM (IST)

    బేగంబజార్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు.. 

    బేగంబజార్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు.. 

    బీజేపీ: 06 టిఆర్ఎస్: 01

    రాంనగర్.. టీఆర్ఎస్  5 బీజేపీ 4

  • 04 Dec 2020 09:26 AM (IST)

    పఠాన్‌చేరు పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    టీఆర్ఎస్. 1 బీజేపీ. 0 టీడీపీ. 0 కాంగ్రెస్ 1 Ind. 0 Nota. Rejected. Total. 2

  • 04 Dec 2020 09:24 AM (IST)

    భారతీనగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు.. ఆధిక్యంలో బీజేపీ..

    భారతీనగర్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు..

    టీఆర్ఎస్.. 3 బీజేపీ. 4 టీడీపీ. 0 కాంగ్రెస్ 0 Ind. 0 Nota. 1 Rejected. 3 Total. 11

  • 04 Dec 2020 09:19 AM (IST)

    పటాన్ చెరులో కోవిడ్ నిబంధనల మధ్య సాగుతోన్న కౌంటింగ్

  • 04 Dec 2020 09:18 AM (IST)

    అల్లాపూర్ డివిజన్‌లో లెక్కింపు వివరాలు..

    అల్లాపూర్ డివిజన్.. మొత్తం - 04

    బీజేపీ - 03

    టీఆర్ఎస్ - 0

    రిజక్ట్ - 01

    ఆధిక్యంలో బీజేపీ

  • 04 Dec 2020 09:17 AM (IST)

    కూకట్‌పల్లిలో భారీ భద్రత నడుమ కొనసాగుతోన్న కౌంటింగ్

  • 04 Dec 2020 09:16 AM (IST)

    సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట సర్కిల్స్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం..

    సంతోష్ నగర్ సర్కిల్ 7 లో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.

    చంద్రాయనగుట్ట సర్కిల్ 8లో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

  • 04 Dec 2020 09:15 AM (IST)

    శేరిలింగంపల్లి సర్కిల్ పొస్యల్ బ్యాలెట్ అప్డేట్ వివరాలు..

    శేరిలింగంపల్లి సర్కిల్ పొస్యల్ బ్యాలెట్ అప్డేట్....

    104 కొండాపూర్ డివిజన్...

    బీజేపీ.... 5 టీఆర్ఎస్.... 0

    105 గచ్చిబౌలి డివిజన్..

    టీఆర్ఎస్...1 రిజక్ట్....2

    106 శేరిలింగంపల్లి డివిజన్...

    టీఆర్ఎస్...5 బీజేపీ....4

  • 04 Dec 2020 09:13 AM (IST)

    చార్మినార్‌లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది...

    చార్మినార్ నియోజకవర్గం, గవర్నమెంట్ సిటీ కాలేజిలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.

  • 04 Dec 2020 09:12 AM (IST)

    కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

    పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది.

    బీజేపీ-23

    టీఆర్ఎస్-8

  • 04 Dec 2020 09:07 AM (IST)

    మూసాపేట సర్కిల్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ..

    మూసాపేట సర్కిల్‌లోని ఐదు డివిజన్ల లో బీజేపీ 15 , టీఆరెస్ 8 , టిడిపి 1 , చెల్లనివి 14 ..

  • 04 Dec 2020 09:04 AM (IST)

    సికింద్రాబాద్ జోన్ ఓట్ల లెక్కింపు వివరాలు..

    అంబర్‌‌పేట్- 150993 ముషీరాబాద్- 133525 మల్కాజ్‌గిరి- 138321 సికింద్రాబాద్- 121312 బేగంపేట్- 94679

    మొత్తం ఓట్ల వివరాలు... 6,38,830

  • 04 Dec 2020 09:02 AM (IST)

    ఓల్డ్ మలక్‌పేట్‌లో ఆలస్యంగా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ..

    ఓల్డ్ మలక్‌పేట్‌లోని కౌంటింగ్ సెంటర్‌లో ఇంకా ప్రారంభం కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు. ఏజెంట్‌లను లోపలకు పంపుతున్న అధికారులు. అరగంట ఆలస్యంగా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ

  • 04 Dec 2020 09:02 AM (IST)

    ముషీరాబాద్‌లో కాస్త ఆలస్యంగా ప్రారంభమైన కౌంటింగ్

    ముషీరాబాద్‌ సర్కిల్ లో కౌంటింగ్‌ ప్రారంభం అయింది. కొద్ది సేపటి క్రితమే స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరుచుకున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలయ్యాయి. ముషీరాబాద్‌ సర్కిల్‌ కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు సీపీ అంజనీ కుమార్‌. కౌంటింగ్‌ కేంద్రల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు సీపీ.

  • 04 Dec 2020 09:01 AM (IST)

    సుభాష్ నగర్ డివిజన్ లెక్కింపు... ఆధిక్యంలో టీఆర్ఎస్..

    సుభాష్ నగర్ డివిజన్.... పోస్టల్ బ్యాలెట్...  తెరాస. 9 బీజేపీ. 3 టిడిపి. 0 Congress 0 Ind. 0 Nota. 0 Rejected. 2 Total. 14

  • 04 Dec 2020 09:00 AM (IST)

    జీడిమెట్ల డివిజన్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. ఆధిక్యంలో బీజేపీ...

    జీడిమెట్ల డివిజన్... పోస్టల్ బ్యాలెట్ తెరాస. 4 బీజేపీ. 6 టిడిపి. 0 Congress 0 Ind. 0 Nota. 0 Rejected. 1 Total. 11

  • 04 Dec 2020 09:00 AM (IST)

    చింతల్ డివిజన్ లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ...

    Chintal Division TRS... BJP...2 Cong.. TDP.. IND... Invalid..2 BJP Lead.. 2

  • 04 Dec 2020 08:58 AM (IST)

    రంగారెడ్డి డివిజన్ ఓట్ల లెక్కింపు.. బీజేపీ లీడ్..

    రంగారెడ్డి డివిజన్.. పోస్టల్ బ్యాలెట్ తెరాస. 2 బీజేపీ. 3 టిడిపి. 0 Congress 0 Ind. 0 Nota. 0 Rejected. 0 Total. 5

  • 04 Dec 2020 08:56 AM (IST)

    ఓటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసుల మోహరింపు..

    నవాబ్ సాహెబ్ కుంటా , ధూద్ బౌలీ , జహానుమ , రాంనస్థపురా , కిషన్ బాగ్ , ఫలక్ నామా డివిజన్ల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలక్షన్ కమిషన్ నుండి గుర్తింపు కలిగిన ఐడి కార్డ్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పోలీసులు...

  • 04 Dec 2020 08:55 AM (IST)

    గాజులరామారం డివిజన్ ఓట్ల లెక్కింపు.. లీడింగ్‌లో బీజేపీ..

    Gajularamaram Division TRS..2 BJP..3 Cong..1 TDP.. IND.. Lead...BJP

  • 04 Dec 2020 08:54 AM (IST)

    గచ్చిబౌలి డివిజన్‌లో మూడు బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్ట్.. ఒకటి టీఆర్ఎస్‌కు..

    గచ్చిబౌలి డివిజన్(105) లో వచ్చిన మూడు బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్ట్ కాగా ఒకటి తెరాస అభ్యర్థి సాయిబాబాకు వచ్చింది..

  • 04 Dec 2020 08:53 AM (IST)

    హైదర్‌నగర్ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్.. బీజేపీ ఆధిక్యం..

    హైదర్ నగర్ పోస్టల్ బ్యాలెట్ రిజల్స్:

    Trs 01,

    బీజేపీ 03

    టీడీపీ 01

    బీజేపీ ఆధిక్యం

  • 04 Dec 2020 08:51 AM (IST)

    ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ లెక్కింపు వివరాలు.. టీఆర్ఎస్ ఆధిక్యం..

    పోస్టల్ బ్యాలెట్: ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ బీజేపీ 7,

    TRS 8,

    చెల్లని ఓట్లు 2

    టీఆర్ఎస్ ఆధిక్యం..

  • 04 Dec 2020 08:49 AM (IST)

    పురాణపుల్, ఘాన్సీ బజార్‌లలో రీపోలింగ్ అవసరం లేదని కోర్టుకు తెలిపిన రాష్ట్ర ఎన్నికల సంఘం

    పూరణపుల్, ఘాన్సీ బజార్ డివిజన్లలోని పలు పోలింగ్ కేంద్రాల్లో చివరి గంటల్లో అనూహ్యంగా ఓటింగ్ పెరిగిందని, రెండు డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. అయితే అంతా సవ్యంగానే జరిగిందని, ఎటువంటి రీ పోలింగ్ అవసరం లేదని  కోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

  • 04 Dec 2020 08:46 AM (IST)

    ఆధిక్యంలో బీజేపీ

     జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, 4 స్థానాలలో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది.

  • 04 Dec 2020 08:41 AM (IST)

    కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్‌లకు అనుమతి లేదు:ఎస్‌ఈసీ

    ఏజెంట్లు కేటాయించిన టేబుల్‌కే పరిమితం కావాలి ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. కౌంటింగ్ హాలులో ఉండే వారు ఓటింగ్ రహస్యం కాపాడాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు శిక్షార్హులవుతారని,  కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధమని చెప్పారు. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

  • 04 Dec 2020 08:39 AM (IST)

    హైదర్‌నగర్ డివిజన్‌లో 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

    హైదర్‌నగర్ డివిజన్‌లో 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి.

    హైదర్‌నగర్ డివిజన్ పోస్టల్ బ్యాలెట్: బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1

  • 04 Dec 2020 08:33 AM (IST)

    మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశం

    మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది.  సాయంత్రం 5 గంటలకల్లా లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో 17 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి.

    ఓల్డ్ బోయిన్‌పల్లి పోస్టల్ బ్యాలెట్: టీఆర్‌ఎస్ 8, బీజేపీ 7,  తిరస్కరణ 2

  • 04 Dec 2020 08:31 AM (IST)

    ఓల్డ్ మలక్‌పేట్‌లో ప్రారంభమైన కౌంటింగ్

    ఓల్డ్ మలక్‌పేట్ నియోజకవర్గంలోని 6డివిజన్‌ కౌంటింగ్ అంబేర్‌పేట్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు.  అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లోని బ్యాలెట్ బాక్స్‌లను  కౌంటింగ్ సిబ్బంది తెరిచారు.

  • 04 Dec 2020 08:19 AM (IST)

    ముషీరబాద్ సర్కిల్ లో ఇంకా ప్రారంభం కాని కౌంటింగ్

    ముషీరబాద్ సర్కిల్ లో ఇంకా  కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. స్ట్రాంగ్ రూమ్‌లు ఇంకా తెరుచుకోలేదు. కౌంటింగ్ సిబ్బందికి సెంటర్ బయట ఇప్పుడే అధికారులు ఐడి కార్డులు ఇస్తున్నారు.

  • 04 Dec 2020 08:16 AM (IST)

    సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన

    ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి బయటే ఉంచారు అంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. ఉదయం ఐదు గంటలకు వచ్చి ఎదురుచూస్తున్నామని..దాదాపు 200 మంది ఉద్యోగులు పోలింగ్ కేంద్రం బయటనే ఉంచారని వారు ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ కౌంటింగ్ ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీలు వేసి ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లమంటున్నారని చెబుతున్నారు. తాము విధులకు వచ్చినట్టు అటెండెన్స్ కూడా వేయడం లేదని..కావలసిన సిబ్బంది కంటే అధికంగా ఎందుకు పిలిచారు అంటూ ఆందోళనకు దిగారు.

  • 04 Dec 2020 08:11 AM (IST)

    కూకట్ పల్లి, మూసాపేట్‌ జోన్లలో కౌంటింగ్ ప్రారంభం

    కూకట్ పల్లి, మూసాపేట్‌ జోన్లలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టారు.  స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ కేంద్రాల వద్దకు కెమెరాల సమక్షంలో బాక్సులు తరలించారు సిబ్బంది. అన్ని టేబుళ్ల వద్ద పోస్టల్ బండిల్స్ కడుతున్నారు. వార్డుల వారిగా పోస్టల్ బ్యాలెట్లను విడదీసి టేబుళ్ల దగ్గరకు పంపారు.

  • 04 Dec 2020 08:07 AM (IST)

    కౌంటింగ్ కేంద్రాల వద్ద...కోలాహలం

    కౌంటింగ్ కేంద్రాల వద్దకు నాయకులు వారి అనుచర గణంతో చేరుకుంటున్నారు. దీంతో కోలాహలం మొదలైంది.  ఉదయం 7 గంటల నుంచే  ఎన్నికల సిబ్బంది, ఏజంట్ల ఐడెంటీ వేరిఫికేషన్ ప్రారంభమైంది.  కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. 8గంటలకు కౌంటింగ్ ప్రాసెస్ ప్రారంభించారు అధికారులు. మసాబ్ ట్యాంక్ సెంటర్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలతో సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మాస్క్ లు..శానిటైజర్లు తప్పనిసరి అనే నిబంధనను పెట్టారు. బ్యాలెట్ బాక్స్ లు తీసుకువచ్చే సిబ్బందికి పిపిఈ కిట్లు ధరించాలనే ఆదేశాలు అందాయి.

Published On - Dec 05,2020 12:07 AM

Follow us
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు