Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

నకిలీ బిల్లులతో రూ.300 కోట్ల వ్యాపారం..! పట్టుబడ్డ నిందితులు

Guntur Business Man Arrested for Illegal Activites, నకిలీ బిల్లులతో రూ.300 కోట్ల వ్యాపారం..! పట్టుబడ్డ నిందితులు

ప్రకాశంజిల్లా వ్యాప్తంగా నకిలీ వేబిల్లులు సృష్టించి గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 278 నకిలీ కంపెనీల పేరుతో 18,239 నకిలీ వేబిల్లులు సృష్టించి,.. 300 కోట్ల రూపాయల వ్యాపారం సాగించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన 85 కోట్ల రూపాయల జిఎస్‌టి, మైనింగ్‌ ట్యాక్స్‌లను ఎగ్గొట్టారని పోలీసులు తేల్చారు. ఈ భారీ కుంభకోణంపై స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జంపని వెంకట సుబ్బారావు, చేబ్రోలు రమేష్, లోలుగు గౌరీనాయుడు, ఎర్రగోపు
మహేంద్ర అనే నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశామని, ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్‌పి శిద్దార్డ్‌ కౌశల్‌ తెలిపారు.
అయితే, ప్రకాశంజిల్లాలో గ్రానైట్‌ అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. క్వారీల నిర్వాహకులు, ఫ్యాక్టరీల యజమానుల ఇష్టారాజ్యం నడుస్తోందని విమర్శిస్తున్నారు. అధికారులను లోబర్చుకొని ప్రభుత్వానికి రాయల్టీ, పన్నులు చెల్లించకుండా కోట్ల విలువైన రాయిని దొడ్డిదారిన ఇతర రాష్ట్రాలు, కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు యువకులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అదికారులు ట్యాక్స్‌ ఎగ్గొట్టి పెద్ద ఎత్తున నకిలీ వేబిల్లులతో వందల కోట్ల వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ నకిలీ వ్యాపారుల దందాపై స్టేట్‌ట్యాక్స్‌ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు.