రేపు భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం

భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో స్వామివారిని శుక్రవారం బంగారు కవచాలతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం శాస్త్రోక్తంగా రెండు రకాల చెక్కలతో అగ్నిని జ్వలింపజేసి యాగశాలలో ప్రతిష్ఠాపన చేశారు. ఈ ఘట్టం భక్తులకు నయనానందం కలిగించింది. తర్వాత ధ్వజారోహణం నేత్రపర్వంగా సాగింది. ప్రత్యేకంగా తయారుచేసిన ప్రసాదాన్ని గరుడమూర్తికి నివేదన చేసి… తరువాత భక్తులకు అందించారు. సీతారాముల కళ్యాణానికి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించడం ఆనవాయితీ. దేవతలందరూ […]

రేపు భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2019 | 3:45 PM

భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో స్వామివారిని శుక్రవారం బంగారు కవచాలతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం శాస్త్రోక్తంగా రెండు రకాల చెక్కలతో అగ్నిని జ్వలింపజేసి యాగశాలలో ప్రతిష్ఠాపన చేశారు. ఈ ఘట్టం భక్తులకు నయనానందం కలిగించింది. తర్వాత ధ్వజారోహణం నేత్రపర్వంగా సాగింది. ప్రత్యేకంగా తయారుచేసిన ప్రసాదాన్ని గరుడమూర్తికి నివేదన చేసి… తరువాత భక్తులకు అందించారు. సీతారాముల కళ్యాణానికి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించడం ఆనవాయితీ. దేవతలందరూ స్వామి కళ్యాణానికి విచ్చేసి వీక్షించాలంటూ ఆహ్వానం పలికారు. కళ్యాణంలో మరో ముఖ్యమైన ఘట్టం ఎదుర్కోలు ఉత్సవం. ఏప్రిల్ 14న నిర్వహించే సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

అభిజిత్ లగ్నంలో మైథిలి మైదానంలో సీతారాముల కళ్యాణం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల మధ్య జరగనుంది. సీతారాముల కళ్యాణంలో ప్రత్యేకంగా నిలిచేవి గోటి తలంబ్రాలు. వీటిని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఏటా అందజేస్తున్నారు . వరి నారు పోసిన దగ్గరి నుంచి పవిత్రంగా సేకరించిన ధాన్యాన్ని గోటితో ఒలిచి తమ భక్తిని చాటుకుంటారు. కోటి గోటి తలంబ్రాలను కలశాల్లో ఉంచి శుక్రవారం భద్రాచలం తీసుకొచ్చి సీతారామస్వామి ఆలయ అధికారులకు అందజేశారు. మరోవైపు, నవమి కళ్యాణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి శనివారం ఉదయం 10 గంటల తర్వాత నవమి తిథి వస్తుండగా, కళ్యాణం మాత్రం ఆదివారం నిర్వహించనున్నారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ ముహూర్తం వెళ్లిపోయిన తర్వాత కళ్యాణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.