సచివాలయ పరీక్షలు: విద్యాసంస్థలకు సెలవులు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల వచ్చే నెలలో ఏడు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలుండే విద్యాసంస్థలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో 544 విడుదల చేశారు. కాగా వచ్చే నెల 1వ తేది నుంచి 8వ తేదీ వరకు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు కళాశాలలు, పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు […]

సచివాలయ పరీక్షలు: విద్యాసంస్థలకు సెలవులు
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 4:11 PM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల వచ్చే నెలలో ఏడు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలుండే విద్యాసంస్థలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో 544 విడుదల చేశారు.

కాగా వచ్చే నెల 1వ తేది నుంచి 8వ తేదీ వరకు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు కళాశాలలు, పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షలకు లక్షలాది మంది హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక 2వ తేది వినాయకచవితి సెలవు ఉండగా.. 3, 4, 5, 6 తేదీల్లో స్థానిక సెలవులు ఇవ్వనున్నారు.