Breaking News
  • నల్గొండ: ధర్మారెడ్డిపల్లి కాల్వను పూర్తిచేసి రైతులకు నీరు ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తేనే సీఎం అని అనిపించుకుంటారు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • కరీంనగర్‌: అల్గునూర్‌ బ్రిడ్జి పైనుంచి పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి, భార్యకు గాయాలు. కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు గాయాలు. మృతుడు కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు. కొమురవెళ్లి జాతరకు వెళ్తుండగా ఘటన.
  • సిద్దిపేట: జగదేవపూర్‌లో ఉద్రిక్తత. చైర్మన్‌ పదవి కోసం రెండువర్గాలుగా చీలిన టీఆర్‌ఎస్. ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు.
  • చెన్నై: విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం. పొలాల్లో మల విసర్జన చేశాడని యువకుడిని కొట్టిన అగ్రవర్ణాల పెద్దలు. యువకుడికి తీవ్రగాయాలు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. గాయాలతో ఉన్న యువకుడిని ఇంటికి పంపిన పోలీసులు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు మృతి. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆందోళన. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌.
  • బాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులపై రాజకీయ రచ్చ. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు. ట్విట్టర్‌లో చంద్రబాబుపై విజయసాయి ధ్వజం. కౌంటర్‌ ఎటాక్‌ చేసిన టీడీపీ నేతలు. శ్రీనివాస్‌ కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీని డైరీలో రాసుకున్నాడు. దోచుకున్నవి, దొంగ లెక్కలను పర్‌ఫెక్ట్‌గా రికార్డ్‌ చేశాడు-విజయసాయి. దోపిడీదారులు నిప్పుకణికల్లా బిల్డప్‌ ఇస్తుంటారు-విజయసాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తే చట్టపర చర్యలు-యనమల. ఐటీ దాడులను భూతద్దంలో చూపించారు-యనమల. రూ.2 వేల కోట్ల నగద అని ప్రచారం చేశారు. చంద్రబాబుకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి-యనమల. శ్రీనివాస్‌ ఇంట్లో వేల కోట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు-బుచ్చయ్య. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్‌లపై విచారణ చేయాలి-బుచ్చయ్య.

Grama Sachivalayam Jobs: గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్..

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఆ పోస్టులను భర్తీ చేసేందుకు మార్చి చివరి వారంలో రాత పరీక్షను నిర్వహించేందుకు సిద్దమైనది. అంతేకాకుండా దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఏపీపీఎస్సీ బోర్డు అప్పగించింది.
Grama Sachivalayam Jobs, Grama Sachivalayam Jobs: గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్..

Grama Sachivalayam Jobs: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే 14 వేల ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆ పోస్టులను భర్తీ చేసేందుకు మార్చి చివరి వారంలో రాత పరీక్షను నిర్వహించేందుకు సిద్దమైంది. అంతేకాక దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఏపీపీఎస్సీ బోర్డుకు అప్పగించింది. ప్రశ్నాపత్రం రూపొందించిన దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు అన్ని కూడా బోర్డు పర్యవేక్షణలోనే జరగనున్నాయి.

Also Read: Another Senior Leader Resigns Janasena Party

ఇదిలా ఉంటే రాత పరీక్షను 3-4 రోజులు నిర్వహించి.. ఆ తర్వాత వారం రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఫలితాల్లోని మెరిట్ లిస్ట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీకి బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారు. కాగా, గతంలోనే 14,061 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గడువు తేదీ ముగిసే సమయానికి సుమారు 11,06,614 మంది అప్లై చేసుకున్నారు.

Also Read: KTR Good News To Poor People