రైతుల కోసం ల‌క్ష కోట్లుః కేంద్ర మంత్రి సీతారామ‌న్

లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌నీస మ‌ద్ధ‌తు ధ‌రల ప్ర‌కారం రైతుల నుంచి పంట‌లు కొనుగోలు చేశామ‌ని చెప్పారు…..

  • Jyothi Gadda
  • Publish Date - 5:51 pm, Fri, 15 May 20
మూడోరోజు కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ్ చేసిన ప్ర‌క‌ట‌న‌లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. డెయిరీ పరిశ్రమలు, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు ప్యాకేజీని ప్రకటించారు. ఇందు కోసం 11 అంశాల్లో రాయితీలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ధాన్యం, గోధుమల ఉత్తత్తిలో స్వయం సమృద్ధి సాధించామని చెప్పారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌నీస మ‌ద్ధ‌తు ధ‌రల ప్ర‌కారం రైతుల నుంచి పంట‌లు కొనుగోలు చేశామ‌ని చెప్పారు.
రైతుల‌కు రూ. 74,300కోట్లు చెల్లించిన‌ట్లు కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో 2 నెల‌ల్లో ఫ‌స‌ల్ భీమా యోజ‌న కింద రూ. 6400 కోట్లు రైతుల‌కు ప‌రిహారంగా చెల్లించామ‌న్నారు. పీఎం  కిసాన్ ప‌థ‌కం ద్వారా రూ. 18, 700 కోట్ల నిధుల‌ను రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా చేసిన‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో పాల‌సేక‌ర‌ణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంద‌ని కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. స‌హ‌కార డెయిరీల ద్వారా మిగులు పాల‌ను సేక‌రించామ‌ని..దీని ద్వారా పాడి రైతుల‌కు రూ. 4100 కోట్ల మేర ప్ర‌యోజ‌నం చేకూర్చిన‌ట్లు ఆమె స్ప‌ష్టం చేశారు. పాడి రైతుల‌కు రూ. 5వేల కోట్ల‌తో ప్ర‌త్యేక ప్రోత్సాహం అందిస్తామ‌ని తెలిపారు. దీని ద్వారా 2 కోట్ల మంది పాడి రైతుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు.