ప్రభుత్వ స్కూళ్లలో సెల్‌ఫోన్ నిషేదం.. ఏపీ సర్కార్ నిర్ణయం

Govt teachers banned from using mobile phones in class AP Govenrment passed orders, ప్రభుత్వ స్కూళ్లలో సెల్‌ఫోన్ నిషేదం.. ఏపీ సర్కార్ నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు పాఠశాలల్లో సెల్‌ఫోన్స్ వాడకాన్ని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని చెబుతున్న జగన్ సర్కార్ ఆదిశగానే అడుగులు వేస్తోంది. నాణ్యమైన విద్యను విద్యార్ధులకు అందించడంలో భాగంగా ఇకపై స్కూల్లో టీచర్లు సెల్‌ఫోన్ వినియోగించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విద్యార్ధులకు పాఠాలు చెప్పకుండా సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తున్న టీచర్లు బాగా పెరిగిపోతున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

తాజా నిర్ణయం ప్రకారం స్కూల్లో టీచర్ వద్ద మొబైల్ ఫోన్ ఉన్నట్టు తెలిస్తే ఆ ఉపాధ్యాయునితో పాటు ప్రధానోపాధ్యాయునిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తరగతిగదిలో పాఠాలుచెప్పే ఉపధ్యాయులకు సెల్‌ఫోన్స్‌తో పని ఏమిటని ప్రశ్నించారు. కొంతమంది గవర్నమెంట్ టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తున్నారని, ఇలాంటి వారిపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

ఇదిలా ఉంటే స్కూల్లో మొబైల్ ఫోన్ నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడంపై ప్రభుత్వ టీచర్లు అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే విద్యార్ధుల తల్లిదండ్రులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *