Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

ఆ చట్టాన్ని సవరిస్తే 50% స్కూళ్ళు బంద్.. మరి కెసీఆర్ ఆలోచనేంటి ?

govt schools number to become less in telangana soon, ఆ చట్టాన్ని సవరిస్తే 50% స్కూళ్ళు బంద్.. మరి కెసీఆర్ ఆలోచనేంటి ?

తెలంగాణలో 50 శాతం ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయా? అందుకు కెసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణం కానున్నాయా? పరిస్థితి చూస్తే అలాగే వుందంటున్నారు విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో 50 శాతం మూతపడే పరిస్థితి కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణం.. కెసీఆర్ ప్రభుత్వం త్వరలో విద్యాహక్కు చట్టాన్ని సవరించేందుకు పూనుకోవడమే. ఇప్పటికే ఈ అంశంపై ఆరుగురు సభ్యుల కమిటీని ముఖ్యమంత్రి నియమించినట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన కీలక భేటీ శుక్రవారం హైదరాబాద్‌లో జరుగుతుంది.

విద్యాహక్కు చట్టంలో ప్రభుత్వ పాఠశాలల లిమిట్స్‌ను (పరిధులు) క్లియర్‌గా నిర్దేశించారు. దాని ప్రకారం సేఫ్ వాకింగ్ దూరం వున్నప్పటికీ ఒక కిలోమీటరు దూరంలో అవసరాన్ని బట్టి ప్రైమరీ పాఠశాల (ఒకటి నుంచి అయిదో తరగతి వరకు) ఏర్పాటు చేయవచ్చు. 3 కిలోమీటర్ల రేంజ్‌లో ప్రాథమికోన్నత పాఠశాల (6 నుంచి 8వ తరగతి వరకు) ను ఏర్పాటు చేసే అవకాశం వుంది. ఉన్నత పాఠశాల (పదో తరగతి వరకు)ను మాత్రం 5 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ తాజాగా ఆరుగురు సభ్యులున్న కమిటీ చేసిన ప్రతిపాదన ప్రకారం అన్ని పాఠశాలలకు ఈ నిబంధన (దూరం) అయిదు కిలోమీటర్లుగా ప్రభుత్వం నిర్దేశించనున్నది. ఈ మేరకు విద్యాహక్కుచట్టంలో మార్పులు చేసేందుకు కెసీఆర్ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

ఈరకంగా అన్ని స్థాయుల పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరాన్ని నిర్దేశిస్తే.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు పెద్ద ఎత్తున మూతపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అంటే 5 కిలోమీటర్ల రేంజ్‌లో వున్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా వుంటే దగ్గరలోని మరో స్కూళ్ళో దాన్ని విలీనం చేసేందుకు తాజాగా తీసుకురానున్న విద్యాహక్కు చట్ట సవరణ దోహదమవుతుంది. ఈ విషయంపై ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతోపాటు విద్యార్థుల పేరెంట్స్, విద్యార్థి సంఘాలు ఇప్పుడే ఆందోళన పడుతున్నాయి.

విద్యాహక్కు చట్టంలో తీసుకురానున్న ఈ మార్పు వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై అధిక శాతం వేటు పడే ఛాన్స్ వుంది. ఎందుకంటే ఈ దూరం నిబంధన అర్బన్ ప్రాంతాలకు పెద్దగా వర్తించదు. పట్టణాల్లో పాఠశాలలు దూరం ఆధారంగా కాకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏర్పాటవుతూంటాయి.

విద్యాహక్కు చట్టంలో తీసుకురానున్న ఈ మార్పును ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏదో రకంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే చట్టంలో ఈ మార్పు తీసుకువస్తున్నారని ఆరోపిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. గతంలో రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను కుదించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, ఇపుడు విద్యాహక్కు చట్టం సవరణతో మరోసారి అదేవిధంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇలాంటి చర్యలను మానుకుని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడం వంటి చర్యలకు కెసీఆర్ ప్రభుత్వం పూనుకోవాలని సూచిస్తున్నారు.