బీటెక్, డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: అందుబాటులో మూడు లక్షల ఇంటర్న్‌షిప్‌లు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. విద్యా, ఉపాధి రంగాలను చావు దెబ్బకొట్టింది. కొలువుల కోతతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయింది. విద్యార్థులకు భవిష్యత్తుపై ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ది అర్బన్‌ లెర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ లేదా తులిప్‌ (TULIP) పేరిట ఒక పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిస్తోంది. తాజా గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా […]

బీటెక్, డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: అందుబాటులో మూడు లక్షల ఇంటర్న్‌షిప్‌లు..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 5:57 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. విద్యా, ఉపాధి రంగాలను చావు దెబ్బకొట్టింది. కొలువుల కోతతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయింది. విద్యార్థులకు భవిష్యత్తుపై ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ది అర్బన్‌ లెర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ లేదా తులిప్‌ (TULIP) పేరిట ఒక పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిస్తోంది. తాజా గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ద్వారా ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్‌ ఇది. దేశంలోని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం దీనిద్వారా లభిస్తుంది. ప్రస్తుతం 23,970 సంస్థల్లో దాదాపు మూడు లక్షల ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. 2025 నాటికి కోటి ఇంటర్న్‌షిప్స్‌ కల్పించాలనేది తులిప్‌ లక్ష్యం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవకాశాలు ఒకేచోట అందుబాటులో ఉంటాయి.

కాగా.. ఇంజినీరింగ్‌ వారికి మాత్రమే ప్రధానంగా ఉండే ఈ అవకాశాన్ని దాదాపు అన్ని విభాగాలకు విస్తరించడం దీని ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. దరఖాస్తు దారులు భారతీయులై ఉండాలి. గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో.. బి.ప్లాన్, బీటెక్, బి.ఆర్క్, బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, ఎల్‌ఎల్‌బీ తత్సమాన విద్యను పూర్తిచేసినవారు అర్హులు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయి 18 నెలల లోపు అయి ఉండాలి. అలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు (క్లిక్ చేయండి): https://internship.aicte-india.org/module_ulb/Dashboard/TulipMain/index.php