కరోనా ఎఫెక్ట్: ఇక భారత్‌లో ‘టెలీమెడిసిన్‌’ వైద్యసేవలు!

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో దేశంలో 'టెలీమెడిసిన్‌' విధానంలో వైద్యసేవలు అందించటానికి 'మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా' మార్గదర్శకాలు జారీచేసింది.

కరోనా ఎఫెక్ట్: ఇక భారత్‌లో 'టెలీమెడిసిన్‌' వైద్యసేవలు!
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2020 | 2:39 PM

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో దేశంలో ‘టెలీమెడిసిన్‌’ విధానంలో వైద్యసేవలు అందించటానికి ‘మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ విధానంలో వీడియో సమావేశం, ఫోన్‌ సంభాషణ లేదా మెసేజ్‌ల ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలను అందించే అవకాశం కలుగుతుంది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనావైరస్‌పై పోరుకు టెలీమెడిసిన్‌ అద్భుతంగా సాయం చేయనుంది. చైనాలో కూడా ఆసుపత్రులు కిక్కిరిసన సమయంలో ఈ విధానంలో వైద్యం చేశారు.

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ఇక మారుమూల ప్రాంతాలకు వైద్యసహాయాన్ని అందించటం మరింత సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా దూరంగా ఉన్న రోగులకు చికిత్సను అందించే వైద్యవిధానాన్ని టెలీమెడిసిన్‌ అంటారు. తద్వారా రోగుల వల్ల వైద్య సిబ్బందికి, ఇతరులకు కూడా అంటువ్యాధి సోకే ప్రమాదాన్ని నివారించవచ్చు. అంతే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన ఎక్కువ మందికి వైద్యం అందటానికి కూడా వీలవుతుంది. పరిమిత సంఖ్యలో వైద్యసిబ్బందితో ఎక్కవ మందిని కాపాడవచ్చు.

ఎందుకంటే కరోనా నేపథ్యంలో కొన్ని వదంతులు కూడా ప్రచారమవుతున్నాయి. మలేరియాకు వాడే మందులను ఈ వైరస్‌ సోకకుండా నిరోధించేందుకు ఉపయోగించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. టెలీమెడిసిన్‌ ద్వారా ఇటువంటివి అరికట్టవచ్చుహ్. టెలీమెడిసిన్‌ వైద్యసేవలు అందించేందుకు రిజిస్టర్ చేసుకున్న వైద్యులు మాత్రమే అర్హులు. రోగికి సాంకేతిక సేవలు సరిపోతాయా లేదా నేరుగా వైద్య సేవలు అందించాలా అనేది కూడా ఈ విధానంలో వైద్యులే నిర్ణయిస్తారు. ఈ విధానంలో వైద్యుడు, రోగికి సంబంధించిన వివరాలు పరస్పరం తెలియాలి. టెలీమెడిసిన్‌ విధానంలో వీడియో, ఆడియో, ఫోన్‌ మెసేజ్‌ల రూపంలో కూడా సేవలు అందించవచ్చు. ఔషధాలను సూచించేందుకు ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వాలంటే రోగి తన వయస్సును కచ్చితంగా తెలియచేయాలి.