వాహన డాక్యుమెంట్ల చెల్లుబాటు గడువు పొడిగింపు

దేశంలో మోటారు వాహనాల డాక్యుమెంట్ల చెల్లుబాటు గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తదితరాల వాలిడిటీని  జులై 31 వరకు పొడిగిస్తున్నామని, ఫిబ్రవరి 1 తో వీటి చెల్లుబాటు కాలం ముగిసినప్పటికీ.. వాహనదారులు ఈ కొత్త సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చునని స్పష్టం చేసింది. అలాగే ఆ తేదీ నుంచి […]

వాహన డాక్యుమెంట్ల చెల్లుబాటు గడువు పొడిగింపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 25, 2020 | 1:26 PM

దేశంలో మోటారు వాహనాల డాక్యుమెంట్ల చెల్లుబాటు గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తదితరాల వాలిడిటీని  జులై 31 వరకు పొడిగిస్తున్నామని, ఫిబ్రవరి 1 తో వీటి చెల్లుబాటు కాలం ముగిసినప్పటికీ.. వాహనదారులు ఈ కొత్త సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చునని స్పష్టం చేసింది. అలాగే ఆ తేదీ నుంచి పెండింగులో ఉన్న వీటి చెల్లుబాటు ఫీజు పే మెంట్ లో జాప్యం జరిగినప్పటికీ.. అదనపు లేదా లేట్ ఫీజు చెల్లించనక్కర లేదని కూడా ప్రభుత్వం వివరించింది. దీంతో దేశంలోవి వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.