పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త… మ‌రో మూడు నెల‌ల పాటు..

సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో మూడు నెలలపాటు పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను ప్ర‌భుత్వ‌మే భరించనుంది.

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త... మ‌రో మూడు నెల‌ల పాటు..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 10:37 PM

సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో మూడు నెలలపాటు పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను ప్ర‌భుత్వ‌మే భరించనుంది. దీంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స‌మయంలో పీఎఫ్ చందాదారులకు కాస్త ఊర‌ట క‌ల‌గ‌నుంది. పీఎఫ్ ఖాతాలో సాధారణంగా కంపెనీ 12 శాతం, ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) యాడ్ అవుతూ వ‌స్తుంది. అయితే కోవిడ్-19 కారణంగా సెంట్ర‌ల్ గ‌వర్న‌మెంట్ ఈ కంట్రిబ్యూషన్‌ను భరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు కేంద్ర ప్ర‌భుత్వం పీఎఫ్ డబ్బులను మీ తరుపున, మీ కంపెనీ తరుపున ఈపీఎఫ్ అకౌంట్‌లో జమచేస్తూ వచ్చింది.

తాజాగా మరో మూడు నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని మోదీ స‌ర్కార్ భరించనుంది. దీంతో జూన్ నుంచి ఆగస్ట్ వరకు పీఎఫ్ డబ్బులు కేంద్ర‌మే చెల్లిస్తోంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఈ ఫెసిలిటీ అందిస్తోంది. తాజా నిర్ణ‌యంతో ప్రభుత్వంపై రూ.4860 కోట్ల భారం పడనుంది. అలాగే దాదాపు 72 లక్షల మందికి ల‌బ్ది చేకూర‌నుంద‌ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన ప‌థ‌కాన్ని కూడా నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు వెల్ల‌డించారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!