#COVID19 కరోనా భయంతో ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య

కరోనా వైరస్ వ్యాప్తి దేశ ప్రజలందరినీ ఆందోళనలో ముంచెత్తుతోంది. వారిలో కొందరు ఎలాగైనా ఈ ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమిస్తామన్న నమ్మకంతో స్వీయ జాగ్రత్తలు పాటిస్తుంటే మరికొందరు మాత్రం భయాందోళనతో తనువు చాలిస్తున్నారు.

#COVID19 కరోనా భయంతో ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య
Follow us

|

Updated on: Apr 02, 2020 | 3:29 PM

Government employee commits suits due to Corona:  కరోనా భయంతో ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా వైరస్ వ్యాప్తి దేశ ప్రజలందరినీ ఆందోళనలో ముంచెత్తుతోంది. వారిలో కొందరు ఎలాగైనా ఈ ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమిస్తామన్న నమ్మకంతో స్వీయ జాగ్రత్తలు పాటిస్తుంటే మరికొందరు మాత్రం భయాందోళనతో తనువు చాలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో తోటి అధికార యంత్రాంగం నివ్వెరపోయారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సహారాన్‌పూర్‌లోని నాకూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. అతను కరోనావైరస్ వ్యాప్తితో చాలా భయపడుతున్నానంటూ సూసైడ్ నోట్‌లో రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగి చాలా రోజుల నుంచి డిప్రెషన్‌లో ఉన్నారని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని స్థానిక పోలీసు అధికారి, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ ధృవీకరించారు.