ఆ అకౌంట్లను తొలగించండి.. ట్విట్టర్‌కు కేంద్రం లేఖ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ముకశ్మీర్ అంశంపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అంశంపై కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టేట్లు.. తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ.. అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ సమాచారాన్ని షేర్ చేస్తున్న పలు అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో కశ్మీర్‌ వేర్పాటువాదనాయకుడు సయ్యద్‌ అలీ గిలానీ ఖాతా కూడా ఉంది. ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వివాదస్పద ఖాతాలను తొలగించాల్సిందిగా కేంద్రం […]

ఆ అకౌంట్లను తొలగించండి.. ట్విట్టర్‌కు కేంద్రం లేఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 13, 2019 | 7:25 AM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ముకశ్మీర్ అంశంపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అంశంపై కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టేట్లు.. తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ.. అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ సమాచారాన్ని షేర్ చేస్తున్న పలు అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో కశ్మీర్‌ వేర్పాటువాదనాయకుడు సయ్యద్‌ అలీ గిలానీ ఖాతా కూడా ఉంది. ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వివాదస్పద ఖాతాలను తొలగించాల్సిందిగా కేంద్రం ట్విటర్‌కు లేఖ రాసింది. జమ్ముకశ్మీర్‌ పునర్విభజన, ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ లోయలో కేంద్రం ముందుగానే భారీ సైన్యాన్ని మోహరించి అక్కడి ప్రజల భద్రతకు ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తోంది. అక్కడ ఉన్న అన్ని కమ్యూనికేషన్‌ వ్యవస్థలను కేంద్ర నిలిపివేసింది.

అయితే కశ్మీర్‌లో భారీసంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వస్తూన్నారంటూ అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ శ్రీనగర్, దక్షిణ కశ్మీర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించి ప్రస్తుత పరిస్థితుల గురించి సమీక్షించారు. అలాగే పోలీసు ఉన్నతాధికారి దిల్లాబ్‌సింగ్‌, ఆర్మీ అధికారులు లోయలోని పలు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారని, ఎక్కడాకూడా శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం లేదని అధికారులు వెల్లడించారు.