Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

గాంధీలో నిర్లక్ష్యంపై గవర్నమెంట్ యాక్షన్ స్టార్ట్

హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయింది. మరోసారి ఇలా జరగకుండా.. కఠిన చర్యలు చేపడుతోంది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, డ్యూటీ టైంకి ఎవరూ లేకపోవడంపై..
Govt acting on negligent doctors in Gandhi hospital, గాంధీలో నిర్లక్ష్యంపై గవర్నమెంట్ యాక్షన్ స్టార్ట్

హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయింది. మరోసారి ఇలా జరగకుండా.. కఠిన చర్యలు చేపడుతోంది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, డ్యూటీ టైంకి ఎవరూ లేకపోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు.

స్వైన్ ఫ్లూతో వచ్చిన గర్బిణి కేసు నిర్లక్ష్యంపై మెమోలు జారీ చేశారు సూపరింటెండ్స్. మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులకు మెమోలు ఇచ్చి, వివరణ కోరారు. ఒకవైపు కరోనా, మరోవైపు స్వైన్ ఫ్లూ భయం వెంటాడుతున్నా.. గాంధీలో వైద్యులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. వారి నిర్లక్ష్యంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈనెల 18 వ తేదీన రాత్రి వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి వచ్చిన గర్బిణీ స్వైన్ ఫ్లూ కేసులో భాగంగా వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి ఆసుపత్రికి స్వైన్ ప్లూ పేషంట్‌కు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చూపించారు సిబ్బంది.

ఉండాల్సిన డాక్టర్లు ఆ సమయంలో లేరని ఉన్నతాధికారులు గుర్తించారు. నర్సులు సైతం పేషంటును పట్టించుకోకపోవడంపై విచారణ నిర్వహించారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వనున్నారు వైద్యుల బృందం. కాగా.. స్వైన్ ఫ్లూ గర్భిణి ఆడబిడ్డకి జన్మ నిచ్చారు. బిడ్డ పరిస్తితి బాగున్నా, ఇంకా వెంటిలేటర్‌పైనే ఉంచారు.

Related Tags