Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ అండ… బీజేపీకి లాభమా?

Governor Tamilisai Soundararajan Assurance to RTC Employees Over Strike, ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ అండ… బీజేపీకి లాభమా?

గత పద్దెనిమిది రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ తమకు సరైన అండ లభించలేదన్న కొరతతో ఉన్న కార్మికులకు గవర్నర్ తమిళ సై రూపంలో ఒక భరోసా లభించింది. సమ్మె ఎంత కాలం చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదనటమే కాదు.. సమ్మెలో ఉన్న కార్మికులంతా సెల్ప్ డిస్మిస్ అయినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న వేళలో.. ఆయన మనసు మార్చటానికి ఏం చేయాలన్న దానిపై కార్మికులు కిందా మీదా పడుతున్నారు.

తమతో చర్చలు జరిపేందుకు సైతం సిద్ధంగా లేని సీఎం కేసీఆర్ ను ఎలా మార్చాలనుకుంటున్న వేళ.. కార్మికులకు గవర్నర్ రూపంలో పెద్ద అండ లభించినట్లుగా చెప్పక తప్పదు. చర్చలకు ఆహ్వానించటం.. అద్దె బస్సులను తీసుకునే విషయంలో ప్రభుత్వంతో తాను మాట్లాడతానని.. ఆర్టీసీ కార్మికులు భయపడొద్దంటూ గవర్నర్ తమిళ సై ఇచ్చిన భరోసా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త టానిక్ లా పని చేస్తుందని చెప్పాలి.

తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పటంతో పాటు.. కార్మికుల్లో ధైర్యం నింపాలని ఆర్టీసీ జేఏసీ నేతలకు ఆమె సూచన చేయటం చూస్తే.. తమకు గవర్నర్ ఉన్నారన్న భావన ఉద్యోగుల్లో కలిగేలా చేశారని చెప్పాలి. గవర్నర్ మాట ఇచ్చిన తర్వాత.. ప్రభుత్వం సైతం ఆమె మాటను.. సలహా.. సూచనల్ని పరిగణలోకి తీసుకోకుండా ఉండలేదు రాష్ట్రంలో బీజేపీ మరింత చొచ్చుకుపోవాలని భావిస్తున్న వేళ.. అనుకోని రీతిలో వచ్చిన ఆర్టీసీ కార్మికుల సమ్మెను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ వర్గాలకు.. గవర్నర్ తాజా వ్యాఖ్యలు సంతోషాన్ని కలిగిస్తాయని చెప్పకతప్పదు.

Related Tags