Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

గవర్నర్‌పై గుర్రు.. ఎందుకంటే?

governor irritates trs leadership, గవర్నర్‌పై గుర్రు.. ఎందుకంటే?

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై గులాబీ దళం ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిజానికి నరసింహన్ స్థానంలో కొత్త గవర్నర్‌గా తమిళిసై వచ్చినప్పట్నించి ముఖ్యమంత్రి కెసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య పెద్దగా సయోధ్య లేనట్లే కనిపించింది. అందుకే ఆమె గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నుంచి రాజ్‌భవన్‌కు కెసీఆర్ దూరంగానే వున్నారు. దాదాపు మూడు నెలల సైలెన్సును ఛేదిస్తూ.. ఇటీవలే ముఖ్యమంత్రి కెసీఆర్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందేమో అన్న కామెంట్లు వినిపించాయి.

అయితే.. తాజా పరిణామాలు మరోసారి గవర్నర్‌పై అధికార పార్టీ నేతలు గుర్రుగా మారడానికి దారి తీస్తున్నాయని తెలుస్తోంది. కెసీఆర్ కలిసిన తర్వాత గవర్నర్ ప్రభుత్వంతో సయోధ్యగానే వుంటారని గులాబీ దళం భావించింది. కానీ.. అందుకు భిన్నంగా గవర్నర్ తన కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఏకంగా జిల్లా టూర్లకు శ్రీకారం చుట్టారు గవర్నర్ తమిళిసై.

సోమవారం వరంగల్ వెళ్ళిన గవర్నర్.. మంగళవారం రోజంతా వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటన చేశారు. వివిధ సెక్షన్ల ప్రజలతో గవర్నర్ మమేకం అయ్యారు. ప్రజల స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాగా, గవర్నర్ పర్యటనలో బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలు చోట్ల ప్రభుత్వం ఈ ధోరణి టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పిస్తోందని సమాచారం. దాంతో వారంతా తమ పార్టీ అధినేతలు కెసీఆర్, కెటీఆర్‌ల దృష్టికి గవర్నర్ ధోరణిని తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీలోని బిజెపి పెద్దల డైరెక్షన్‌లో ముందుకు వెళుతున్నారని ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కెసీఆర్ భావిస్తున్నారని, అందుకే గవర్నర్ పట్ల ఆయన గుర్రుగా మారారని తాజా సమాచారం. ఈ పరిస్థితి ఎటు వైపు వెళుతుందోనని చర్చలు మొదలయ్యాయి రాజకీయ పరిశీలకుల్లో.