Breaking మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం లభించింది. రాజధాని వికేంద్రీకరిస్తూ ఏపీ అసెంబ్లీలో పాసయిన బిల్లును శుక్రవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. శాసనసభ ఆమోదించినప్పటికీ శాసనమండలిలో...

Breaking మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: Jul 31, 2020 | 5:22 PM

ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం లభించింది. రాజధానిని వికేంద్రీకరిస్తూ ఏపీ అసెంబ్లీలో పాసయిన బిల్లును శుక్రవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. శాసనసభ ఆమోదించినప్పటికీ శాసనమండలిలో ఆమోదం పొందలేదన్న విపక్షాల వాదనకు వ్యతిరేకంగా గవర్నర్ స్పందించడం విశేషం. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

శాసనమండలిలో పెండింగులో వున్న బిల్లులను గవర్నర్ ఆమోదిస్తారా? లేదా? అన్న మీమాంసకు ఏపీ గవర్నర్ తెరదించారు. అసెంబ్లీ ఆమోదం పొంది వుండడం, శాసనమండలి రద్దుకు ప్రభుత్వం సిఫారసు చేయడం, మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానించిన తర్వాత మరోసారి రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసనసభ ఆమోదం పొందివుండడం వంటి అంశాలపై న్యాయసలహా తీసుకున్న గవర్నర్ హరిచందన్ రెండు కీలక బిల్లులపై శుక్రవారం సంతకం చేశారు. దాంతో ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది.

ఏపీ రాజధానిని వికేంద్రీకరిస్తూ శాసనసభలో జనవరి 20వ తేదీన రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అయితే ఆతర్వాత శాసనమండలికి చేరిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు అక్కడ చుక్కెదురైంది. మండలిలో విపక్ష టీడీపీకి ఆధిక్యం వుండడంతో బిల్లును తిరస్కరించి, సెలెక్టు కమిటీకి సిఫారసు చేశారు. దాంతో రాజధాని వికేంద్రీకరణకు బ్రేక్ పడినట్లేనని అందరూ భావించారు.

అయితే, మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో నిక్కచ్చిగా వున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 16వ తేదీన మరోసారి రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసనసభ ముందుకు తెచ్చి మరోసారి ఆమోదం పొందారు. ఆ తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న వికేంద్రీకరణ బిల్లు మూడు వారాల క్రితం రాజ్‌భవన్‌కు చేరింది. అప్పట్నించి గవర్నర్ ఎలా స్పందిస్తారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 16వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందగా.. ఆ మర్నాడు దానిని శాసనమండలికి పంపారు. అయితే బిల్లుపై చర్చ చేపట్టకుండానే మండలి నిరవధికంగా వాయిదా పడింది.

అయితే అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లు మండలిలో చర్చించినా.. చర్చించకపోయినా నెల రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లు భావించాలనేది అధికార వైసీపీ నేతల వాదన. ఈ క్రమంలో జూన్ 17 నుంచి జులై 17 మధ్య నెల రోజులు ముగిసిన నేపథ్యంలో మండలి ఆమోదం పొందినట్లుగానే భావించాలని ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. దానిపై న్యాయసలహా తీసుకున్న గవర్నర్ హరిచందన్ జులై 31న మూడు రాజధానుల ప్రతిపాదనకు ఓకే చెప్పారు.

అదే క్రమంలో రాజధానుల విషయంలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ నేతలు విభిన్నంగా మాట్లాడుతూ వుండడం కూడా మరింతగా కుతూహలాన్ని పెంచింది. గత రెండు రోజులుగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పరస్పరం భిన్నమైన ప్రకటనలు చేశారు. అదోవైపు కొనసాగుతుండగానే శుక్రవారం గవర్నర్ అనూహ్య నిర్ణయంతో రాజధాని వికేంద్రీకరణకు లైన్ క్లియర్ చేశారు. దాంతో ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు ఏర్పాటు కాబోతున్నాయి.

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!