నిషేధిత యాప్‌ కంపెనీలకు 79 ప్రశ్నలు సంధించిన భారత ప్రభుత్వం

దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.

నిషేధిత యాప్‌ కంపెనీలకు 79 ప్రశ్నలు సంధించిన భారత ప్రభుత్వం
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 6:49 PM

దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా 79 ప్రశ్నలను సంధించింది. అందులో ఈ సంస్థలకు ఫండింగ్‌ ఎక్కడి నుంచి వస్తుంది..? డేటా మేనేజ్‌మెంట్‌, సర్వర్లు, వాటి మాతృసంస్థలకు సంబంధించిన వివరాలు, అవి ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయి..? వంటి పలు ప్రశ్నలు ఉన్నాయి.

ఇక ఈ 79 ప్రశ్నలకు సంబంధించి సదరు కంపెనీలు ప్రభుత్వానికి సరైన వివరణ ఇవ్వగలిగితే మళ్లీ ఈ యాప్‌లు భారత్‌లో పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సదరు కంపెనీలు ఇచ్చే సమాధానాలు ఒక కమిటీకి పంపనున్న అధికారులు.. అందుకు సంబంధించిన రిపోర్టులను ప్రభుత్వానికి అందజేయనున్నారు. మరోవైపు యాప్‌ల పనితీరుపై ఇండియన్‌ ఇంటెలిజన్స్‌ ఏజన్సీలు, గ్లోబల్‌ సైబర్‌ వాచ్‌ డాగ్‌లు కూడా భారత ప్రభుత్వానికి రిపోర్టులను ఇవ్వనున్నాయి. ఈ  నేపథ్యంలో చైనా కంపెనీలు ఇచ్చే సమాచారం ఈ ఏజన్సీలు ఇచ్చే రిపోర్టుతో సరిపోవాలి.