Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

ఆ ఉద్యోగుల సేవలు రద్దు… ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

Government order in AP to terminate the services of Retired Employees, ఆ ఉద్యోగుల సేవలు రద్దు… ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సేవలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31కు ముందున్న వారి సేవలు అవసరం లేదని తేల్చింది. అదే విధంగా 40 వేల వేతనం మించిన అవుట్ సోర్సింగ్ సిబ్బందినీ తపపించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టీడీపీ హాయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా..పేపర్ నోటిఫికేషన్ లేకుండా నియమితులైన వారిని సైతం తొలిగించాలని ఆదేశించింది. అంతేకాదు.. ప్రభుత్వ ఆదేశాల్ని అమలు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు.. ముఖ్య కార్యదర్శులు.. కార్యదర్శుల్ని వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ముందు పేపర్ నోటిఫికేషన్.. నియామక ప్రక్రియ ద్వారా కాకుండా నియమించిన వారిలో రూ.40వేలకు పైనే వేతనం తీసుకుంటున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. ఈ ఉత్తర్వులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇవేకాక కార్పొరేషన్లు.. అటానమస్ సంస్థలకు కూడా ఈ జీవో వర్తిస్తుందని పేర్కొన్నారు. తాము తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాల్ని సాధారణ పరిపాలనా శాఖకు.. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖాళీ అయ్యే కొలువులు కొత్త వారికి దక్కే వీలుందని చెబుతున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పదవీ విరమణ చేసిన వారినే కొనసాగించటం కారణంగా కొత్త వారికి అవకాశాలు దక్కటం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో.. కొత్త ఉద్యోగాల భర్తీ అంశం మీద చర్చ జరిగింది. జనవరిలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారికి కొలువులు కేటాయించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో రిటైర్ అయిన పలువురు ఉద్యోగులు..కీలక పోస్టుల్లో ఉన్న వారు అధికారపార్టీకి దగ్గరగా ఉన్న వారిని కొనసాగించేలా నిర్ణయాలు తీసుకున్నారు.