గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్…ఆ పరీక్షల ధరలను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం

కరోనా పరీక్షల ధరలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా 60 శాతం ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది‌.

  • Sanjay Kasula
  • Publish Date - 7:59 pm, Wed, 18 November 20

కరోనా పరీక్షల ధరలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా 60 శాతం ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది‌.

ప్రైవేటు ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్‌(RTPCR) టెస్ట్‌ చేస్తే రూ. 850 మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ పరీక్షల ధర రూ. 2 వేలు ఉండేది. అలాగే ఇంటి దగ్గర రక్తనమూనాలు సేకరిస్తే రూ. 1200 వసూలు చేయాలని ఆదేశించింది. గతంలో ఈ పరీక్ష ధర రూ. 2600 ఉంది. దీంతో తగ్గించిన ధరల వల్ల కరోనా పరీక్షలు చేయించుకునే వారికి కాస్త ఊరట లభించింది.