టిక్‌టాక్‌కు ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిన పాకిస్తాన్‌ ప్రభుత్వం

పబ్జీ వీడియో గేమ్‌ను నిషేధించిన పాకిస్తాన్‌ ఇప్పుడు టిక్‌టాక్‌పై పడింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంతో పబ్జీని నిషేధించిన పాకిస్తాన్‌ టిక్‌టాక్‌పై కూడా అదే అభియోగాన్ని మోపుతోంది.

టిక్‌టాక్‌కు ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిన పాకిస్తాన్‌ ప్రభుత్వం
Follow us

|

Updated on: Jul 21, 2020 | 2:04 PM

పబ్జీ వీడియో గేమ్‌ను నిషేధించిన పాకిస్తాన్‌ ఇప్పుడు టిక్‌టాక్‌పై పడింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంతో పబ్జీని నిషేధించిన పాకిస్తాన్‌ టిక్‌టాక్‌పై కూడా అదే అభియోగాన్ని మోపుతోంది. టిక్‌టాక్‌లో అసభ్యత, అశ్లీలత హద్దులు దాటకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ను ఆదేశించింది పాకిస్తాన్‌ ప్రభుత్వం. పబ్జీ, టిక్‌టాక్‌లే కాదు సోషల్‌మీడియాలోని పలు యాప్స్‌లో అసభ్య కంటెంట్‌ ఉంటున్నదంటూ బోలెడన్ని ఫిర్యాదులు వస్తున్నాయని పాకిస్తాన్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ అథారిటీ అంటోంది. ఎక్కువ మట్టుకు టిక్‌టాక్, బిగోలోనే అడల్ట్‌ కంటెంట్‌ ఉంటోందట! ఈ కారణంగా యువత చెడుదారి పట్టే అవకాశాలు ఉన్నాయన్నది పీటీఏ కంప్లయింట్‌. ఇప్పటికే ఈ విషయంపై ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చామని చెబుతోంది. అయితే తమ నోటీసులకు అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రావడం లేదని, దీంతో ఇప్పటికే బిగోను నిషేధించామని పీటీఏ చెబుతోంది. టిక్‌టాక్‌కు ఆఖ‌రి హెచ్చ‌రిక జారీ చేశామని, టిక్‌టాక్‌లో మితిమీరుతున్న అశ్లీల‌తను, అస‌భ్య‌త‌ను, అనైతిక వీడియోల‌ను నియంత్రించేందుకు స‌మ‌గ్ర‌మైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించామ‌ని పాకిస్తాన్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ అథారిటీ అంటోంది. మనం కూడా దేశ‌ స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌న్న కార‌ణంతో టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేశాం. దీంతో పాటు చైనాకు చెందిన మ‌రో 58 యాప్‌ల‌పై నిషేధం విధించాం.