ఏపీలో ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై సర్కార్ కొరడా !

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ కోవిడ్‌ కేర్ సెంటర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోవిడ్ సెంటర్‌లపై ఏపీ ప్రభుత్వ కొరడా ఝులిపిస్తోంది. సరైన సదుపాయలు లేని, పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఏపీలో ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై సర్కార్ కొరడా !
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 11:32 AM

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ కోవిడ్‌ కేర్ సెంటర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోవిడ్ సెంటర్‌లపై ఏపీ ప్రభుత్వ కొరడా ఝులిపిస్తోంది. సరైన సదుపాయలు లేని, పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

విజయవాడలో ఐదు ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్ సెంటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడమేగాకుండా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రమేష్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న స్వర్ణ హైట్స్‌, డాక్టర్‌ లక్ష్మీ నర్సింగ్‌ హోమ్‌ వారి ఎనికేపాడులోని హోటల్‌ అక్షయ, బ్రిటిష్‌ హాస్పిటల్‌ వారు నిర్వహిస్తున్న బెంజిసర్కిల్‌లోని హోటల్‌ ఐరా, ఎన్నారై హీలింగ్‌ హ్యాండ్స్‌, ఆంద్రా హాస్పిటల్‌ వారి సన్‌ సిటీ, కృష్ణ మార్గ్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు అనుమతులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.

నగరంలోని రోగుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకే ఈ ఐదు కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే తాజాగా స్వర్ణప్యాలెస్‌ ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు.. తనిఖీలు చేసి అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు ఈ కేసులో నిందితులుగా చేర్చలేదని ప్రశ్నించిన నేపథ్యంలో అధికారులు ఈ తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. తాజాగా బుధవారం ఉదయం అనంతపూర్‌లోని సర్వజన ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. మంటల్లో పలు రికార్డులు, ఫర్నిచర్ కాలిపోయింది. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఆస్పత్రుల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్టంలో మరికొన్ని చోట్ల కూడా నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్న కోవిడ్‌ కేర్ సెంటర్ల అనుమతులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం పయనిస్తోంది.