ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా మాజీ పోలీస్ బాస్.. ఆర్పీ ఠాకూర్‌ను నియమిస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

పీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా...

  • Sanjay Kasula
  • Publish Date - 1:22 pm, Wed, 13 January 21
ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా మాజీ పోలీస్ బాస్.. ఆర్పీ ఠాకూర్‌ను నియమిస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

 APSRTC MD RP Thakur  : ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఆయనను.. ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన ఠాకూర్.. రాష్ట్ర డీజీపీగా, అంతకుముందు ఏసీబీ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఠాకూర్ కీలక బాధ్యతలను నిర్వహించారు.

రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు బదిలీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఠాకూర్‌ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం వెల్లడింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డిని ఆర్పీ ఠాకూర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ వీసీఎండీగా నియమించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.