బ్యాంక్ కస్టమర్లకు కేంద్రం సలహా.. అలా చేయాలంటూ సూచన..

సైబర్ ఎటాక్స్, అనుమానాస్పద మెయిల్స్ నుంచి బ్యాంక్ కస్టమర్లు తమను తాము రక్షించుకునేలా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సైబర్ దోస్త్ ట్విట్టర్ వేదికగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది.

బ్యాంక్ కస్టమర్లకు కేంద్రం సలహా.. అలా చేయాలంటూ సూచన..
Follow us

|

Updated on: Aug 29, 2020 | 5:37 PM

protect your banking account from fraud: నానాటికీ బ్యాంక్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త టెక్నిక్‌లతో ఖాతాదారుల డబ్బును లూటీ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో బ్యాంక్ కస్టమర్లకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సైబర్ ఎటాక్స్, అనుమానాస్పద మెయిల్స్ నుంచి బ్యాంక్ కస్టమర్లు తమను తాము రక్షించుకునేలా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సైబర్ దోస్త్ ట్విట్టర్ వేదికగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది. బ్యాంక్ వినియోగదారులు ఎలప్పుడూ రెండు వేర్వేరు మెయిల్స్ ఉపయోగించాలని పేర్కొంది. (తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..)

”ఎల్లప్పుడూ రెండు వేర్వేరు ఈ-మెయిల్స్ వినియోగించాలి. మీరు విశ్వసించే వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి ఒకటి. సోషల్ మీడియా సైట్లలో మీరు ఎంటర్ అయ్యేందుకు మరొకటి ప్రత్యేక ఈ-మెయిల్‌ను ఉపయోగించండి. ఇందువల్ల స్కామర్లకు మీ అఫీషియల్ అకౌంట్ ఏంటని తెలిసే ఛాన్స్ ఉండదు” అని సైబర్ దోస్ట్ ట్వీట్ చేసింది.

ముఖ్యంగా, స్కామర్లు కస్టమర్లను నమ్మించే విధంగా పలు ఈమెయిల్స్‌ను ఉపయోగిస్తుంటారు. అందువల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఆర్ధిక లావాదేవీలకు ఉపయోగించే ఎలాంటి ఈ-మెయిల్స్‌ను సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దని సూచిస్తోంది. అంతేకాకుండా వివిధ వెబ్ బ్రౌజర్లలో ఉన్న AUTO FILL ఆప్షన్‌ను వినియోగదారులు ఉపయోగించకూడదని.. బ్యాంక్‌కు సంబంధించిన సివివి, ఎక్స్‌పైరీ డేట్, కార్డ్ నంబర్ వంటి క్లిష్టమైన సమాచారాన్ని టైప్ చేయాలని కోరింది. కాగా, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి.. అనధికారికంగా తమ స్నేహితుల నుంచి ఆర్ధిక సహాయం పొందే అవకాశాలు ఉన్నాయని సైబర్ దోస్త్ గతంలోనే బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్