ఖమ్మంలో కరోనా పరీక్షలకు ఏర్పాట్లు..సర్కార్ గ్రీన్ సిగ్నల్!

తెలంగాణను కరోనా వణికిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీ స్థాయిలో నమోదవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే నమోదు అవుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం టెస్టుల పరిమితిని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా...

ఖమ్మంలో కరోనా పరీక్షలకు ఏర్పాట్లు..సర్కార్ గ్రీన్ సిగ్నల్!
Follow us

|

Updated on: Jul 01, 2020 | 5:02 PM

తెలంగాణను కరోనా వణికిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీ స్థాయిలో నమోదవుతోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 8, 785 ఉండగా, కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 260కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే నమోదు అవుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం టెస్టుల పరిమితిని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం పట్టణంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అనుమతి మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇక నుండి జిల్లాలోనే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ఖమ్మం కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. అతిత్వరలోనే జిల్లా కేంద్రంలో కరోనా టెస్ట్‌లు నిర్వహించే అవకాశం కలుగుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌, కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్) లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..