వశిష్ట వారధి..కల సాకారం ! మారనున్న లంక ప్రజల తలరాతలు

ఉభయ గోదావరి జిల్లావాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరిపోనున్నాయి.  తరతరాలుగా ఎదుర్కొంటున్న లంక ప్రజల తలరాతలు మారిపోనున్నాయి.  పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణంలో అడ్డంకులు, అవంతరాలు తొలగిపోనున్నాయి. ఉభయ గోదావరి ప్రజల చిరకాల వాంఛ అయిన వశిష్ట వంతెన నిర్మాణానికి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇరు జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి రేవు వద్ద వారధి […]

వశిష్ట వారధి..కల సాకారం ! మారనున్న లంక ప్రజల తలరాతలు
Follow us

|

Updated on: Nov 07, 2019 | 8:33 PM

ఉభయ గోదావరి జిల్లావాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరిపోనున్నాయి.  తరతరాలుగా ఎదుర్కొంటున్న లంక ప్రజల తలరాతలు మారిపోనున్నాయి.  పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణంలో అడ్డంకులు, అవంతరాలు తొలగిపోనున్నాయి. ఉభయ గోదావరి ప్రజల చిరకాల వాంఛ అయిన వశిష్ట వంతెన నిర్మాణానికి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇరు జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి రేవు వద్ద వారధి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వశిష్ట వారధి నిర్మాణం కోసం సీఎం జగన్‌ వంద కోట్ల నిధులు కేటాయిచడంపై రాజోలు వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజోలు వైసీపీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్‌ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే.. తనయుడు సీఎం జగన్‌ వారధి నిర్మాణాన్ని పూర్తి చేస్తారని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే, లంకవాసుల కలగా మిగిలుతుందనుకున్న వశిష్ట వారధి నిర్మాణంపై రెండు నెలల క్రితమే టీవీ 9లో ప్రసారమైన కథనానికి మంచి ఫలితం దక్కిందని స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.