ప్రభుత్వ కార్యాలయాల్లో సెల్ఫీ అటెండెన్స్.. ఎక్కడో తెలుసా..?

Government Employees Take Selfie To Mark Attendence In Mulugu District, ప్రభుత్వ కార్యాలయాల్లో సెల్ఫీ అటెండెన్స్.. ఎక్కడో తెలుసా..?

ములుగు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల అటెండెన్స్ విధానంలో కలెక్టర్ నారాయణ వినూత్న మార్పు తీసుకొచ్చారు. ఉద్యోగులంతా సమయ పాలన పాటించాలని.. సెల్ఫీ అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చారు. ఆయనే స్వయంగా ఈ యాప్‌ను తయారు చేయించారు. ములుగు వెలుగు అటెండెన్స్ అనే పేరుతో యాప్ ను రూపొందించారు. వైద్య ఆరోగ్య శాఖ, స్కూల్, పంచాయత్ రాజ్ శాఖ, ఆర్‌అండ్‌బీ, ఆస్పత్రి.. ఇలా శాఖ ఏదైనా సరే కచ్చితంగా ఉద్యోగులంతా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే అని కండీషన్ పెట్టారు. ఉదయం 9 గంటల వరకూ ఆఫీసుకు వెళ్లి తమ సీట్లలో కూర్చొని సెల్ఫీ దిగి యాప్ ద్వారా కలెక్టర్‌కు పంపాలి. ఒక వేళ నైట్ ఎవరైనా ఉద్యోగి పనిచేస్తే ఆ వివరాలు కూడా యాప్‌ ద్వారా తెలియజేయాలి. అయితే ఈ విధానం పై కొందరు ఉద్యోగులు గుర్రుగా ఉన్నా.. ప్రజలు మాత్రం కలెక్టర్ ను మెచ్చుకుంటున్నారు. దీనివల్ల అధికారులు ఆఫీసులకు సమయానికి వస్తున్నారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *