Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

టీఎస్ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్ ఉద్యోగాలు.. రిక్రూట్‌మెంట్‌ ఎప్పుడంటే..

Government arrangements for recruitment of new conductors and drivers in Rtc

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె ఐదోరోజుకు చేరుకుంది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్థంభించిపోవడంతో.. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సమ్మెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గడువు లోగా విధులకు హాజరుకాని వారు ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించలేమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆర్టీసీలో కొత్త ఉద్యోగులను చేర్చుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇప్పటికే రోడ్లపై అక్కడక్కడా బస్సులు తిరుగుతున్నా.. ప్రయాణికులకు అవి సమయానికి అందుబాటులో ఉండటం లేదు. ఈ బస్సుల్లో టార్గెట్ ఫిక్స్ చేసి ఆయా రూట్లలో కొంతమంది కండక్టర్లను, డ్రైవర్లను తాత్కాలికంగా నియమించుకుని బస్సులు నడుతుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీలో కొత్తగా కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రవాణా శాఖ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా సమాచారం. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీశర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా ఈ పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. కొత్తగా రిక్రూట్ చేసుకునే కండక్టర్లు, డ్రైవర్ల విషయంలో ఉండాల్సిన విధి విధానాలు, ఇతర నిబంధనల విషయంలో అధికారులు తలమునకలైనట్టుగా తెలుస్తోంది.

నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ సిబ్బంది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా సంస్ధను ప్రైవేటు పరం చేయవద్దని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిని చెల్లిస్తే సంస్ధ నష్టాలనుండి .. లాభాల దిశగా పయనిస్తుందని కార్మికసంఘాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా మూడు విభాగాలుగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో సమ్మె చేస్తూ.. విధులకు హాజరుకాని ఉద్యోగులు స్వచ్ఛందంగానే తొలగిపోయినట్టు చెప్పారు. దీంతో డిపోల బయట ఆందోళన చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో .. తమ పరిస్థితి ఏమిటనే దిశగా కార్మిక సంఘాలు బుధవారం అఖిలపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. గవర్నర్‌ను కలిసి తాజా పరిస్థితిపై వినతి పత్రం ఇవ్వాలని కూడా కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు.