పిల్లలకు బండి ఇస్తే.. మీరు ఇక జైలుకే!

‘భరత్ అనే నేను’ సినిమాలో ట్రాఫిక్ ఉల్లఘించేవారికి భారీ జరిమానా విధిస్తాడు ముఖ్యమంత్రి మహేష్ బాబు. ఇక అది సినిమా. అయితే ఆ సినిమా చూసిన వారంతా.. సరిగ్గా అలాంటి భారీ జరిమానాలు కేంద్రం విధిస్తేనే ట్రాఫిక్ రూల్స్‌ను ఎవరూ కూడా ఉల్లంఘించే ప్రయత్నం చేయరని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే రూల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలోనే అమలు చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పదే పదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించేవారికి కేంద్రం షాక్ ఇస్తూ భారీ జరిమానా […]

పిల్లలకు బండి ఇస్తే.. మీరు ఇక జైలుకే!
Follow us

|

Updated on: Jun 25, 2019 | 7:30 AM

‘భరత్ అనే నేను’ సినిమాలో ట్రాఫిక్ ఉల్లఘించేవారికి భారీ జరిమానా విధిస్తాడు ముఖ్యమంత్రి మహేష్ బాబు. ఇక అది సినిమా. అయితే ఆ సినిమా చూసిన వారంతా.. సరిగ్గా అలాంటి భారీ జరిమానాలు కేంద్రం విధిస్తేనే ట్రాఫిక్ రూల్స్‌ను ఎవరూ కూడా ఉల్లంఘించే ప్రయత్నం చేయరని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే రూల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలోనే అమలు చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పదే పదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించేవారికి కేంద్రం షాక్ ఇస్తూ భారీ జరిమానా విధించేలా వాహనాల చట్ట సవరణ బిల్లును సవరించింది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై పిల్లలకు బండి ఇచ్చేవారికి  25 వేల రూపాయల ఫైన్, మూడేళ్ళ జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అటు మద్యం సేవించి వాహనం నడిపినా, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయినా 10 వేల రూపాయల ఫైన్ జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే 5 వేల రూపాయల ఫైన్ వేసేలా దీన్ని రూపొందించగా.. ఈ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.