చిన్నారులపై అత్యాచారం చేస్తే ఉరిశిక్షే

దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కేంద్రం ముందడుగు వేసింది. పోక్సో చట్ట సవరణకు(2012) ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడేలా ఈ చట్టానికి సవరణ చేయనుంది. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరణ చేయనుంది. కఠిన శిక్షల ద్వారానే చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకడ్డ వేయడంతో పాటు అత్యాచారాలను అదుపుచేసేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు ఈ భేటీలో […]

చిన్నారులపై అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 7:08 AM

దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కేంద్రం ముందడుగు వేసింది. పోక్సో చట్ట సవరణకు(2012) ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడేలా ఈ చట్టానికి సవరణ చేయనుంది. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరణ చేయనుంది. కఠిన శిక్షల ద్వారానే చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకడ్డ వేయడంతో పాటు అత్యాచారాలను అదుపుచేసేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది.

మరోవైపు ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన మూడో విడతలో భాగంగా.. గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానత కోసం 1.25లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చట్టబద్దమైనది కాదని.. పంజాబ్ సహా పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అలాగే దేశంలోని లక్షలాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు మేలు చేసే ‘కార్మిక రక్షణ కోడ్‌’కు ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా 13కేంద్ర కార్మిక చట్టాలను ఒకే కోడ్ పరిధిలోకి తీసుకురానున్నారు. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కార్మికులు ఆరోగ్య రక్షణ, భద్రత వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఉద్యోగుల సంఖ్య 10మందికి పైగా ఉండే అన్ని పరిశ్రమలకు ఈ కోడ్ వర్తిస్తుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా అక్రమ డిపాజిట్లను సేకరించే కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన నియంత్రణ లేని డిపాజిట్ల పథకం రద్దు బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో చట్ట విరుద్ధంగా డిపాజిట్లను పెంచినట్లైతే సదరు వ్యక్తులకు శిక్ష, తిరిగి చెల్లించేందుకు తగిన నిబంధనలున్నాయి. వీటితో పాటు ఉద్యోగులకు మెరుగైన సేవా ప్రయోజనాలు చేకూర్చేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఆర్గనైజ్ గ్రూప్-ఏ హోదాకు కేంద్ర కేబినెట్ కల్పించింది.