Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

అమ్మకు వరుడు కావాలంటూ.. కొడుకు ట్వీట్…

Looking For A Handsome 50 Old Man For My Mother Says Goutham Adhikari, అమ్మకు వరుడు కావాలంటూ.. కొడుకు ట్వీట్…

మనం ఎప్పుడూ సినిమాల్లో చూసే సంఘటనలు రియల్‌గా జరుగుతుంటే కాస్త థ్రిల్ ఫీల్ అవుతాం. సరిగ్గా ఇలాంటిదే ఒకటి రీసెంట్‌గా జరిగింది. ‘మా అమ్మకు వరుడు కావలెను’ అంటూ ఆస్తా వర్మ అనే అమ్మాయి చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ 50 ఏళ్లున్న పెళ్లికొడుకు కావాలంటూ.. అతను శాకాహారి, నాన్ డ్రింకర్‌, మంచి వ్యక్తి అయి ఉండాలంటూ…వాళ్ళ అమ్మతో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది.

ఇక ఇప్పుడు ఇదే కోవలో పశ్చిమ బెంగాల్‌లోని హుగలీ జిల్లాకు చెందిన గౌరవ్ అధికారి అనే యువకుడు ‘మా అమ్మకు వరుడు కావలెను’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

“ఐదేళ్ల క్రిందట మా నాన్న చనిపోయారు. ఉద్యోగం కారణంగా నేను ఎక్కువగా బయట ఉంటాను. ఇంట్లో మా అమ్మ ఒక్కరే ఉండాల్సి వస్తోంది. కొద్దిరోజుల తర్వాత నేను పెళ్లి చేసుకుంటే.. ఆమె ఒంటరి అయిపోతుంది. అందుకే మా అమ్మకు ఓ తోడు కావాలి” అని గౌరవ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వితంతువు అయిన అమ్మానాన్నలకు సినిమాల్లో పెళ్లిళ్లు చేయడం సహజం. కానీ ఇక్కడ భిన్నంగా ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో తమ తల్లులకు వరుడును చూద్దాం జరుగుతోంది.

এটা কোন গা ভাসানো ট্রেন্ড নয়.. এটা আমার মনের ইচ্ছে মা কে নতুন জীবন দেওয়ার… আমি কালকেই বলেছিলাম একটা সিদ্ধান্তের কথা…

গৌরব অধিকারী यांनी वर पोस्ट केले शनिवार, ९ नोव्हेंबर, २०१९