“గౌతమి ఎక్స్‌ప్రెస్” మానని గాయం … నేటికి 11 ఏళ్లు పూర్తి

ఎవ్వరికీ తెలియదు.. ఆ ప్రయాణమే తమకు ఆఖరిదవుతుందని .. అప్పటి వరకు నవ్వుతూ సరదాగా సాగిపోయిన మజిలీలో ఒక్కసారిగా పెను ప్రమాదం. పట్టాలపై స్పీడుగా దూసుకెళ్తున్న రైలులోనించి కిందికి దూకలేని నిస్సహాయత. వారు ప్రయాణిస్తున్న రైలు బోగీలకు నిప్పంటుకుని అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయని తెలియడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి . పిల్లలు, వారి తల్లిదండ్రులు, వృద్ధుల అరుపులు… రక్షించండంటూ ఆర్తనాదాలు చేసినా దక్కని ఫలితం. రైలు బోగీల్లో చెలరేగిన మంటలతో దాదాపు 32 మంది అక్కడికక్కడే […]

గౌతమి ఎక్స్‌ప్రెస్ మానని గాయం ...  నేటికి 11 ఏళ్లు పూర్తి
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 12:50 PM

ఎవ్వరికీ తెలియదు.. ఆ ప్రయాణమే తమకు ఆఖరిదవుతుందని .. అప్పటి వరకు నవ్వుతూ సరదాగా సాగిపోయిన మజిలీలో ఒక్కసారిగా పెను ప్రమాదం. పట్టాలపై స్పీడుగా దూసుకెళ్తున్న రైలులోనించి కిందికి దూకలేని నిస్సహాయత. వారు ప్రయాణిస్తున్న రైలు బోగీలకు నిప్పంటుకుని అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయని తెలియడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి . పిల్లలు, వారి తల్లిదండ్రులు, వృద్ధుల అరుపులు… రక్షించండంటూ ఆర్తనాదాలు చేసినా దక్కని ఫలితం. రైలు బోగీల్లో చెలరేగిన మంటలతో దాదాపు 32 మంది అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు. ఈ దారుణ ఘటన జరిగి నేటికి 11 ఏళ్లయింది.

2008 జూలై 31 వతేదీ వస్తే చాలు ఓ ఘోర ప్రమాదం గుర్తుకు వస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కాకినాడకు ప్రయాణమైన ” గౌతమి ఎక్స్‌ప్రెస్” రైలుకు జరిగిన అగ్నిప్రమాదం ఎన్నిటికీ మర్చిపోలేనిది. దేశవ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన ఈ దుర్ఘటన జరిగి ఒక దశాబ్దం నిండిపోయింది. అర్ధరాత్రి సమయంలో అంతా నిద్రలోకి జారుకున్న వేళ ..ఇప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌కు సమీపంలోని కే సముద్రం- తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య రైలుకు మంటలు అంటుకున్నాయి. ఈప్రమాదంలో ఎస్ 10,11,12 రిజర్వేషన్ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటల మధ్య చిక్కుకున్న 32 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కనీసం వీరి అవశేషాలు కూడా లభ్యం కాలేదు.

కాలి బూడిదైన శరీరాలతో కే సముద్రం స్టేషన్‌కు రైలుబోగీలను తీసుకురావడంతో దీన్ని చూసిన స్ధానిక జనానికి కన్నీరు ఆగలేదు. దాదాపు 15 రోజుల పాటు మృతుల బంధువులు తమ వారి ఆచూకీ కోసం అక్కడే పడిగాపులుకాసిన సంఘటన వీరిని తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో అప్పటికి ఎవ్వరికీ తెలియలేదు. తెల్లవారేనాటికి దేశం మొత్తం వ్యాపించి తీవ్రం కలవరానికి గురిచేసింది. ఈ రైలు ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించడానికి రెండేళ్ల సుధీర్ఘ కాలం పట్టింది. మృతుల కుటుంబాల డీఎన్ఏలతో మృతుల డీఏన్ఏలు సరిపోల్చిన తర్వాతే డెత్ సర్టిఫికెట్లు సైతం అందించారు. ఈ ఘటన జరిగినజరిగిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి , కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి నారాయణ్‌బావ్త్వ్రా స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కన్నీరు మున్నీరైన మృతుల కుటుంబాలను ఓదార్చారు.

ఈ ఘటన జరిగి నేటికి 11 ఏళ్లు గడిచినా.. “గౌతమి ఎక్స్‌ప్రెస్” గాయం మాత్రం ఇంకా పచ్చిగానే ఉంది.