కరోనా నుంచి ట్రంప్‌ కోలుకున్నారట! పబ్లిక్‌ మీటింగ్‌లలో పాల్గొనవచ్చట!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు.. ఎప్పటిలాగే ప్రజల మధ్యకు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. డాక్టర్లు అంత భరోసా ఇచ్చిన తర్వాత ట్రంప్‌ గమ్మున ఎలా ఉంటారు..?

కరోనా నుంచి ట్రంప్‌ కోలుకున్నారట! పబ్లిక్‌ మీటింగ్‌లలో పాల్గొనవచ్చట!
Follow us

|

Updated on: Oct 10, 2020 | 10:03 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు.. ఎప్పటిలాగే ప్రజల మధ్యకు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. డాక్టర్లు అంత భరోసా ఇచ్చిన తర్వాత ట్రంప్‌ గమ్మున ఎలా ఉంటారు..? ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు.. రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్టు గా అనిపించడం లేదూ! నిన్నటి నుంచి ట్రంప్‌కు జ్వరం రావడం లేదని, ట్రంప్‌ కోవిడ్‌ చికిత్స కోర్సు పూర్తయిందని డాక్టర్లు ప్రకటించారు. కరోనా చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రిలో చేరిన ట్రంప్‌ నాలుగు రోజులు గడిచాయో లేదో వైట్‌హౌస్‌కు వచ్చేశారు.. వైట్‌హౌస్‌కు వచ్చిననాటి నుంచి ట్రంప్‌ భేషుగ్గా ఉన్నారని వైద్యులు అంటున్నారు. అసలు కరోనా పెరిగిన దాఖలాలేమీ కనిపించలేదట! ట్రంప్‌కు కరోనా సోకి పది రోజులవుతుండటంతో హాయిగా ప్రజల మధ్యకు వెళ్లవచ్చని చెప్పారు.. డాక్టర్ల ప్రకటనపై చాలా మందికి చాలా అనుమానాలు వచ్చాయి.. హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలొసి కూడా బోడెలన్నీ డౌట్స్‌ పడుతున్నారు. ట్రంప్‌ అనారోగ్యం బారిన పడ్డారు కాబట్టి సరిగ్గా పదవీ బాధ్యతలను నిర్వర్తించలేరని, అంచేత రాజ్యాంగంలోని 25వ సవరణను అమలు చేసి ట్రంప్‌ను పదవిలోంచి తొలగించాలని ఆమె సూచిస్తున్నారు. ఇందుకామె కాంగ్రెస్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఓ కమిషన్‌ను నియమించాలన్నది పెలొసి భావన.. అందుకోసం కూడా ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెలొసి ప్రకటన చూసిన తర్వాత ట్రంప్‌ గమ్మున ఉండరు కదా! ఆమెపై సహజమైన ధోరణిలో మండిపడ్డారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.