శభాష్ ! షణ్ముగ సుబ్రహ్మణ్యన్.. యూ ఆర్ గ్రేట్ !

చంద్రుని ఉపరితలంపై విక్రమ్ లాండర్ శకలాలను మొదట గుర్తించిన చెన్నై ఇంజనీర్ షణ్ముగ సుబ్రహ్మణ్యన్ కు అమెరికాలోని నాసా నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 33 ఏళ్ళ ఈ మెకానికల్ ఇంజనీర్.. ఇందుకు ఎంతో సంతోషిస్తున్నాడు. నాసా శాస్త్రజ్ఞుల నుంచి తనకు మంచి రెస్పాన్స్ వచ్చిందని షణ్ముగ తెలిపాడు. విక్రమ్ లాండర్ శకలాలను గుర్తించిన అనంతరం తాను ఇస్రోకు, నాసాకు ఈ విషయమై ట్వీట్ చేశానని, నాసా సిబ్బందికి రెండు ఈ-మెయిల్స్ కూడా పంపానని ఈ యువ ఇంజనీర్ […]

శభాష్ ! షణ్ముగ సుబ్రహ్మణ్యన్.. యూ ఆర్ గ్రేట్ !
Follow us

| Edited By:

Updated on: Dec 03, 2019 | 8:10 PM

చంద్రుని ఉపరితలంపై విక్రమ్ లాండర్ శకలాలను మొదట గుర్తించిన చెన్నై ఇంజనీర్ షణ్ముగ సుబ్రహ్మణ్యన్ కు అమెరికాలోని నాసా నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 33 ఏళ్ళ ఈ మెకానికల్ ఇంజనీర్.. ఇందుకు ఎంతో సంతోషిస్తున్నాడు. నాసా శాస్త్రజ్ఞుల నుంచి తనకు మంచి రెస్పాన్స్ వచ్చిందని షణ్ముగ తెలిపాడు. విక్రమ్ లాండర్ శకలాలను గుర్తించిన అనంతరం తాను ఇస్రోకు, నాసాకు ఈ విషయమై ట్వీట్ చేశానని, నాసా సిబ్బందికి రెండు ఈ-మెయిల్స్ కూడా పంపానని ఈ యువ ఇంజనీర్ చెబుతున్నాడు. వారు నాసాలోని ఎల్ఆర్ఓ ప్రాజెక్టు శాస్త్రజ్ఞులని, వారి నుంచి తనకు మంచి ప్రోత్సాహం లభించిందని వెల్లడించాడు.

కేవలం తన ల్యాప్ టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ఉన్న షణ్ముగ సుబ్రహ్మణ్యన్…లాండర్ శకలాల ఆచూకీకోసం చెన్నైలోని తన ఇంట్లో రోజుకు సుమారు ఏడు గంటలపాటు వర్క్ చేస్తూ వచ్చాడట. లాండింగ్ స్పాట్ నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్నది విక్రమ్ లాండరేనా ? చంద్రుని ఉపరితలంలో ఇసుకలో అది కూరుకుపోయిందా ? అంటూ అక్టోబర్ 3 న నాసా, ఇస్రోలకు ట్యాగ్ చేసి ట్వీట్ చేశానని షణ్ముగ పేర్కొన్నాడు. నవంబర్ 17 న క్రాష్ సైట్ కు సంబంధించిన రెండు ఇమేజీలను కూడా ట్వీట్ చేశానని, చివరకు అవి విక్రమ్ లాండర్ శకలాలేనని భావించానని చెప్పాడు. నిజానికి మధురైకి చెందిన సుబ్రహ్మణ్యన్ ఓ మల్టీ నేషనల్ సంస్థలో ఐటీ టెక్కీగా కూడా పని చేస్తున్నాడు. ఈ యువ ఇంజనీర్ చాలామంది అమెచ్యూర్ శాస్త్రజ్ఞులకు మార్గదర్శిగా మారుతాడని నాసా అంచనా వేస్తోంది. విక్రమ్ లాండర్ శకలాల ఆచూకీని ఇతడు కేవలం తన ల్యాప్ టాప్ ద్వారా గుర్తించాడంటే అతని కృషి వెనుక ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతోందని అమెరికన్ రీసెర్చర్లు కూడా అభినందిస్తున్నారు.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..