Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

Mahesh Babu: మహేష్-వంశీ ప్రాజెక్ట్ ఆగిపోలేదా..! అసలు మ్యాటరేంటంటే..!

Gossips about Mahesh movie, Mahesh Babu: మహేష్-వంశీ ప్రాజెక్ట్ ఆగిపోలేదా..! అసలు మ్యాటరేంటంటే..!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించాల్సిన చిత్రం ఆగిపోయిందని ఇటీవల పుకార్లు షికార్లు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇరు వర్గాలు ఖండించకపోవడంతో.. ఇదే నిజమని ఫ్యాన్స్ అనుకున్నారు. మరోవైపు వంశీని హోల్డ్‌ను పెట్టిన మహేష్.. పరశురామ్‌కు ఓకే చెప్పారని టాక్ నడిచింది. ఇక మహేష్ తీరుతో చిన్నబుచ్చుకున్న వంశీ, మరో హీరోకు కథ చెప్పారని కూడా గాసిప్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోలేదట.

మాఫియా నేపథ్యంలో కొనసాగబోయే ఈ చిత్ర కథను ఎప్పుడో మహేష్‌కు చెప్పి ఫైనల్ చేసుకున్నారట వంశీ. ఈ క్రమంలో ఇటీవల స్క్రిప్ట్‌ను కూడా పూర్తి చేసుకొని వెళ్లారట. అయితే ఫైనల్ స్క్రిప్ట్‌తో అంత సంతృప్తి చెందని మహేష్.. మార్పులు చేర్పులు చేసుకొని రావాలని సూచించారట. ఎలాగూ ఈ సినిమాను ఈ వేసవి తరువాత ప్రారంభించాలనుకున్నారు కాబట్టి.. ఆ లోపు మరోసారి స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకొని రావాలని మహేష్ చెప్పారట. దీంతో ఆ పనిలో వంశీ పడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ లోపు వంశీ స్క్రిప్ట్‌‌ను తయారుచేసుకొని మహేష్‌ను ఒప్పించినట్లైతే.. ముందుగా అనుకున్న సమయానికే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. మరి వంశీ, మహేష్‌ను మెప్పిస్తారా..? ఈ కాంబోలో రెండో సినిమా అనుకున్న సమయానికే సెట్స్ మీదకు వెళుతుందా..? అసలు మహేష్-వంశీ ప్రాజెక్ట్‌పై అప్‌డేట్ ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్.. చిరుతో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Read This Story Also: చిరు మూవీలో మహేష్.. చెర్రీ తప్పుకోవడం వెనుక కారణామిదేనా..!

Related Tags