భారీ వర్షానికి కూలిన బ్రిడ్జ్‌.. నిలిచిన రాకపోకలు..

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బిహార్‌, అసోం, వెస్ట్ బెంగాల్..

భారీ వర్షానికి కూలిన బ్రిడ్జ్‌.. నిలిచిన రాకపోకలు..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 10:26 AM

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బిహార్‌, అసోం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో వరదలు ఉప్పొంగిపోతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు.. పిథోర్‌గర్‌, బంగపాణి ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు.. గోసి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రత్యామ్నాయ మార్గాలకోసం రెస్క్యూటీం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.