Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

భైంసా ఎఫెక్ట్.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..

Goshamahal MLA Raja Singh house arrest in Hyderabad, భైంసా ఎఫెక్ట్.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..

హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపుచేసే క్రమంలో పలువురు పోలీసు అధికారులు కూడా గాయాలపాలయ్యారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయనుకున్న సమయంలో.. సోమవారం మధ్యాహ్నం మళ్లీ వదంతులు వ్యాపించడంతో.. మళ్లీ పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పట్టణంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి.. మూడు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఘటనకు సంబంధించి 25మందిని అదుపులోకి తీసున్నట్లు పోలీసులు వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో పోలీసుల ఆదేశాలు ధిక్కరించి.. ఎవరు బయట తిరిగినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజాసింగ్ ఛలో భైంసాకు పిలుపునివ్వడంతో.. శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న అభిప్రాయంతో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు.