‘స్పై’గా గోపీచంద్.. ‘చాణక్య’ ఫస్ట్‌లుక్ అదుర్స్!

కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యాక్షన్ హీరో గోపీచంద్.. తాజాగా తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో ‘చాణక్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ.. హీరో గోపీచంద్‌కి గాయాలు కావడం వల్ల వాయిదా పడింది. అయితే రీసెంట్‌గా మళ్ళీ చిత్రీకరణ మొదలు పెట్టారు. ఇక ఈరోజు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

మాచో గోపీచంద్ సరికొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *