ఉగ్ర ప్రేరేపితంగా ఉన్న 90,000 వీడియోలను తొలగించాం : గూగుల్

ప్రపంచ దేశాల్ని ఉగ్రవాదం వణికిస్తున్న తరుణంలో సామాజిక మాధ్యమాలన్నీ ఉగ్రవాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సందేశాలు ప్రచారంలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది 2019 సంవత్సారంలో ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉన్న 10 లక్షలకు పైగా వీడియోలను గుర్తించామని గూగుల్ వెల్లడించింది. ఇందులో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్న దాదాపు 90,000 వీడియోలను యూట్యూబ్‌ నుంచి తొలగించినట్లు గూగుల్‌ తెలిపింది. ఆయా వీడియోలు సంస్థ నిబంధనలను ఉల్లంఘించాయని అందుకే వాటిని తొలగించామని యూఎస్‌ హౌజ్‌ కమిటీకి గూగుల్‌ నివేదించింది. అయితే ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని టెక్‌ సంస్థలు ముందుకు రావడం లేదని యూఎస్‌ హౌజ్‌ కమిటీ అభిప్రాయపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *