గూగుల్ మ్యాప్స్‌లో 57 వేల టాయిలెట్లు…!

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గూగుల్ సంస్థ కొత్త సదుపాయాలను ముందుకు తెస్తోంది. తాజాగా.. గూగుల్ మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 2,300 నగరాల్లో 57వేల పబ్లిక్ టాయిలెట్ల జాబితాను గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరిచినట్లుగా గూగుల్ సంస్థ తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు ఇది తోడ్పడుతుందని అభిప్రాయ పడింది. ఇక నుంచి ఏదైనా పనికి.. ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. టాయిలెట్స్ గురించి గాబరా పడకుండా.. స్మార్ట్‌ఫొన్‌లో జస్ట్ క్లిక్ ఇస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని గూగుల్ మ్యాప్స్ […]

గూగుల్ మ్యాప్స్‌లో 57 వేల టాయిలెట్లు...!
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 10:50 AM

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గూగుల్ సంస్థ కొత్త సదుపాయాలను ముందుకు తెస్తోంది. తాజాగా.. గూగుల్ మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 2,300 నగరాల్లో 57వేల పబ్లిక్ టాయిలెట్ల జాబితాను గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరిచినట్లుగా గూగుల్ సంస్థ తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు ఇది తోడ్పడుతుందని అభిప్రాయ పడింది.

ఇక నుంచి ఏదైనా పనికి.. ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. టాయిలెట్స్ గురించి గాబరా పడకుండా.. స్మార్ట్‌ఫొన్‌లో జస్ట్ క్లిక్ ఇస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని గూగుల్ మ్యాప్స్ సీనియర్ ప్రోగామ్ మేనేజర్ అనల్ ఘోశ్ స్వయంగా తెలిపారు. కాగా.. గూగుల్.. ఈ కార్యక్రమాన్ని 2016లో ‘పైలట్ ప్రాజెక్టు’గా ప్రారంభించింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ సహకారంతో ముందు ఢిల్లీ, భోపాల్, ఇండోర్ నగరాల్లోని పబ్లిక్ టాయిటెల్స్ జాబితాను పొందుపరిచింది. అనంతరం అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఉన్న అన్ని టాయిలెట్స్‌ను గూగుల్ మ్యాప్‌కు అనుసంధానం చేశారు.