నిరుద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌… ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇంటర్న్‌షిప్ ఆఫర్… దరఖాస్తుకు ఆఖరు తేదీ డిసెంబర్ 11

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. గూగుల్ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది.

నిరుద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌... ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇంటర్న్‌షిప్ ఆఫర్... దరఖాస్తుకు ఆఖరు తేదీ డిసెంబర్ 11
Follow us

|

Updated on: Dec 01, 2020 | 9:30 PM

google summer internship program ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. గూగుల్ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఈ ఇంటర్న్‌షిప్ కు అవకాశమిస్తోంది. పూర్తి వివరాలతో పాటు https://careers.google.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 డిసెంబర్ 11 చివరి తేదీ.

ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ సొల్యూషన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందించాల్సి ఉంటుంది.

ఉండాల్సిన విద్యార్హతలు…

ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కావాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి.

ఇతర అర్హతలు…

జావా, సీ++, పైథాన్‌లో అనుభవం ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా ఆల్గారిథమ్స్ తెలిసి ఉండాలి. వీటితో పాటు SQL, Spring, Hibernate, Web Services (RESTful, SOAP), JavaScript తెలిసి ఉండాలి.

దరఖాస్తు విధానం:

మొదట https://careers.google.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో Application Engineering Intern, Summer 2021 సెర్చ్ చేయాలి. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. అందులో ఇంటర్న్‌షిప్ వివరాలు ఉంటాయి. దరఖాస్తు చేయాలనుకుంటే Apply పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత జీ-మెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. అనంతరం సీవీ లేదా రెజ్యూమె అప్‌లోడ్ చేయాలి. విద్యార్హతల వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి. దీంతో అప్లై ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత సంస్థ నిబంధనలు, అవసరాలు, సమయానుకులంగా మిగితా ప్రక్రియ కొనసాగుతుంది.