ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఈకాష్…ఇలాంటి మరో ఆప్‌ను తొలిగించిన గూగుల్

ప్లే స్టోర్ నుంచి తొలిగింపుల ప్రక్రియను గూగుల్ కొనసాగిస్తోంది. తాజాగా గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి మరో ఐదు యాప్స్‌ను తొలగించింది. వినియోగదారులకు స్వల్ప కాలిక రుణాలు అందించే ఐదు యాప్స్‌ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఈకాష్...ఇలాంటి మరో ఆప్‌ను తొలిగించిన గూగుల్
Follow us

|

Updated on: Nov 24, 2020 | 11:36 AM

Google play store :ప్లే స్టోర్ నుంచి తొలిగింపుల ప్రక్రియను గూగుల్ కొనసాగిస్తోంది. తాజాగా గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి మరో ఐదు యాప్స్‌ను తొలగించింది. వినియోగదారులకు స్వల్ప కాలిక రుణాలు అందించే ఐదు యాప్స్‌ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ వినియోగదారులకు ఎక్కువ వడ్డీరేట్లకు స్వల్పకాలిక రుణాలను అందించడంతో పాటు తిరిగి చెల్లించడానికి రుణగ్రహీతలను వేధించాయి అనే ఆరోపణలు రావడంతో గూగుల్ ఈ చర్యలకు దిగింది. తమ గూగుల్ ప్లేస్టోర్ డెవలపర్ విధానాలు వినియోగదారులను కాపాడటానికి, వారిని సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడినవని గూగుల్ ఈ సందర్భంగా తెలిపింది.

ప్రజలకు త్వరగా నగదు అవసరమైనప్పుడు అందించడానికి లాక్డౌన్ సమయంలో ఇటువంటి గుర్తింపు లేని యాప్స్ పెరిగిపోయాయి. ఈ యాప్స్ పేర్లు కూడా గుర్తింపు గల కంపెనీల పేర్లతో పోలి ఉండటంతో రుణ గ్రహితలు ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో ప్రజలకు తెలియలేదని వివరించింది. వీటిని కనీసం 4,00,000 నుండి 1 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేశారు. టెక్నాలజీ గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుండి తొలిగించిన వాటిలో ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఈకాష్, స్నాప్ ఇట్‌ లోన్‌ యాప్స్ ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యక్తిగత రుణాల నిబంధనల నుంచి ప్రజలను కాపాడటం కోసం తమ ఆర్థిక సర్వీసుల విధానాలను విస్తరించినట్లు పేర్కొంది. ఈ యాప్స్ ఫీచర్లు కూడా మనదేశ చట్టాల పరిధిలోకి రావు అని పేర్కొంది. కాబట్టి ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండని కోరింది.

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.